• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేట్ రిప్లైతో అడ్డంగా...

లేట్ రిప్లైతో అడ్డంగా బుక్కయిన కాజల్‌

By - Tupaki Desk
Update: 2021-05-20 07:30 GMT
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెల్సిందే. కాజల్‌ సోషల్‌ మీడియాలో తనను ఎవరైనా సెలబ్రెటీ మెన్షన్‌ చేసి కామెంట్‌ చేసినా పోస్ట్‌ చేసినా కూడా వెంటనే స్పందిస్తుంది. కొన్ని నిమిషాలు లేదంటే గంటల వ్యవధిలో సమాధానం ఇస్తుంది. కాని అనుష్క చేసిన ట్వీట్‌ కు స్పందించేందుకు మాత్రం ఏకంగా 7 నెలలకు పైగా సమయంను తీసుకుంది. ఇన్నాళ్ల తర్వాత స్పందించడంతో కాజల్‌ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాజల్‌ స్పందించకున్నా పట్టించుకున్న వారు లేరు. కాని ఇప్పుడు స్పందించడంతో అంతా విమర్శిస్తున్నారు.

అసలు విషయం ఏంటీ అంటే ఏడు నెలల క్రితం కాజల్‌ పెళ్లి పీఠలు ఎక్కింది. ఆ సమయంలో ఎంతో మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రెటీలందరికి కూడా కాజల్‌ సమాధానం ఇచ్చింది. కాని అనుష్క చెప్పిన పెళ్లి శుభాకాంక్షలకు మాత్రం కాజల్‌ స్పందించలేదు. అనుష్క ఆ సమయంలోనే ట్విట్టర్ లో అడుగు పెట్టింది. దానికి తోడు అనుష్క ట్విట్టర్‌ అకౌంట్‌ వెరిఫై అయ్యి లేదు. దాంతో అనుష్క ఫ్యాన్‌ పేజీ అనుకుని కాజల్‌ ఆ ట్వీట్‌ ను పట్టించుకున్నట్లుగా లేదు.

అనుష్క ఈమద్య కాలంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటుంది. ఆమె అకౌంట్‌ అధికారికం అని వెళ్లడయ్యింది. దాంతో కాజల్‌ ఇప్పుడు ఆమె ట్వీట్‌ కు సంబంధించింది. పెళ్లి శుభాకాంక్షలు చెప్పిన అనుష్కకు లవ్‌ ఈమోజీలు పెట్టి కృతజ్ఞతలు చెప్పింది. కాజల్‌ ఆలస్యంపై నెట్టింట రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. కరోనా పూర్తిగా పోయాక ట్వీట్‌ కు స్పందించి ఉంటే బాగుండేదని కొందరు.. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అనుష్క ట్వీట్‌ కు కాజల్‌ స్పందించి ఉంటే ఇంకా బాగుండేది అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి ఆ ట్వీట్ కు స్పందించకున్నా కూడా ఎలాంటి విమర్శలు వచ్చేవి కావు.. కాని ఏడు నెలల తర్వాత స్పందించి కావాలని ట్రోల్స్‌ కు అడ్డంగా బుక్కయినట్లుగా కాజల్‌ పని ఉంది.
Tags:    
  • Kajal Agarwal 
  • Kajal Agarwal Latest Images 
  • Kajal Agarwal Photos 
  • Kajal Agarwal Black Dress 
  • Telguu News 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS