కంగనా అహంకారంకు హద్దు లేకుండా పోయింది

Update: 2021-02-10 04:30 GMT
జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత అహంకారంను కలిగి ఉండటం.. గర్వంగా మాట్లాడటం.. ఇతరులను ఏదో ఒక సందర్బంలో చిన్న చూపు చూడటం వంటివి చేస్తుంటారు. అది ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటే పర్వాలేదు. కాని హద్దు దాటితే మాత్రం నిందలు తప్పవు పొగిడిన వారే తిట్ల దండకం ఎత్తక మానరు. ఇప్పుడు అదే పరిస్థితి కంగనా ఎదుర్కొంటుంది. బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వ శక్తితో ఎదిగిన కంగనా రనౌత్‌ అంటే చాలా మందికి అభిమానం ఉంటుంది. సొంతంగా కష్టపడి స్టార్‌ అయ్యింది కనుక ఆమెకు కాస్త అహంకారం గర్వం ఉంటుందని అది అమ్మాయిలకు ఉండాల్సిందే అని అనుకున్నారు. కాని ఇప్పుడు అవి మరీ ఎక్కువ అయ్యాయి.

ఈ ప్రపంచంలో అందరి కంటే నేనే గొప్ప అనుకునే వ్యక్తి అందరి కంటే అధముడు అంటూ ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు కంగనా ఈ భూమి మీద ఉన్న వారిలో అద్బుతమైన నటిని నేనే అంటూ తనను తానే ఆకాశంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. హాలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా అంతకు మించిన వారు కూడా నా ముందు దిగదుడుపే. నాకు నేనే పోటి నాకు ఎవరు లేరు సాటి అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఈ భూమి మీద నా కంటే గొప్ప నటిని మీలో ఎవరైనా చూపించగలరా అంటూ కంగనా చేసిన ట్వీట్ తీవ్ర విమర్శలకు దారి తీసింది.

నీ అహంకారపూరిత వ్యాఖ్యలు తగ్గించుకోకుంటే నెత్తిన పెట్టుకున్న అభిమానులే పాతాలంకు తొక్కేస్తారు. ఎంత ఉన్నా ఒదిగి ఉండే వారికే గౌరవం ఉంటుంది. నీ గర్వంతో కూడిన మాటల వల్ల నీ స్థాయిని ఇప్పటికే చాలా తగ్గించుకున్నావు. ఇంకా నీకు నువ్వుగా దాన్ని తగ్గించుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్స్ ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా ఆమె సోషల్‌ మీడియాలో ప్రచారం కోసం వివాదం కోసం చేస్తున్న వ్యాఖ్యల కారణంగా ఆమెపై జనాల్లో ఆసక్తి తగ్గిపోయింది. తాజా అహంకారపూరిత వ్యాఖ్యలతో మొత్తం ఆమె గురించి జనాల్లో చెడు అభిప్రాయం వచ్చేసింది.
Tags:    

Similar News