స్టార్‌ హీరో చేసిన ట్వీట్‌ పై లొల్లి

Update: 2019-05-07 12:36 GMT
కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర విలక్షణ హీరో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కన్నడంలోనే కాకుండా తమిళం మరియు తెలుగులో కూడా మంచి గుర్తింపును దక్కించుకున్న ఉపేంద్ర కర్ణాటకలో రాజకీయాలు కూడా చేస్తున్నాడు. ఉత్తమ ప్రజాకీయా పార్టీని స్థాపించి రాజకీయాల్లో తనవంతు మార్పు తీసుకు వచ్చేందుకు అంటూ ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజకీయాలు చేస్తూనే హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్న ఉపేంద్ర తాజాగా ఫ్యామిలీతో కలిసి అమెరికా జాలీ ట్రిప్‌ కు వెళ్లాడు. వెళ్లిన వాడు జాలీగా ఎంజాయ్‌ చేసి ఇండియాకు వచ్చేస్తే ఇప్పుడు ఆయన గురించి ఎవరు చర్చించుకునే వారు కాదు, కాని ఉపేంద్ర తన సోషల్‌ మీడియా పేజ్‌ లో పోస్ట్‌ చేసిన ఫొటోలు వివాదాస్పదం అవుతున్నాయి.

అమెరికాకు చెందిన కొన్ని ప్రాంతాలకు చెందిన ఫొటోలను ఉపేంద్ర పోస్ట్‌ చేశాడు. అదే సమయంలో ఇండియాకు చెందిన కొన్ని ప్రాంతాలు, రోడ్ల ఫొటోలను కూడా పోస్ట్‌ చేశాడు. ఉపేంద్ర పోస్ట్‌ చేసిన ఫొటోలు ఇండియాను అవమానించినట్లుగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్‌. అమెరికాలో రోడ్లు విశాలంగా ఉన్నాయని, ఇండియాలో రోడ్లు గుంటలు గుంటలుగా ఉంటాయన్నట్లుగా ఉపేంద్ర తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దాంతో నెటిజన్స్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. చేతనైతే మార్చు, అంతే కాని ఇలా సోషల్‌ మీడియా వేదికగా దేశం పరువు తీయవద్దని ఉపేంద్రకు సలహ ఇస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలపై ఉపేంద్ర ఎలా స్పందిస్తాడో చూడాలి.
Tags:    

Similar News