నెట్ ఫ్లిక్స్ భారీ ప్లాన్.. ఇకపై పాస్వర్డ్ షేరింగ్ బంద్ అంట!

Update: 2021-03-12 09:43 GMT
ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికోసం ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా భారతీయులకు తెలిసినవి కొన్ని ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఈ రెండు మనదేశంలో బాగా ప్రాచుర్యం పొందడమేగాక అత్యధిక వినియోగదారులను కూడా కలిగి ఉన్నాయి. అయితే అమెజాన్ ప్రైమ్ కంటే కూడా దేశంలో నెట్ ఫ్లిక్స్ కాస్త ఎక్కువమంది సబ్ స్క్రైబర్ లను సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లాంటి ఓటిటిలను 'పాస్ వర్డ్'లు షేర్ చేసుకుని ఇతరుల ఖాతాలలో మనం మనకు నచ్చిన సినిమాలు, షోలు ఇలా ఏదైనా చూడవచ్చు. తాజాగా పాస్వర్డ్ షేరింగ్ అనేది నెట్ ఫ్లిక్స్ ఆపేయనుందని సమాచారం.

నెట్‌ఫ్లిక్స్ ఖాతాలను ఉపయోగించే వ్యక్తులు పాస్వర్డ్ షేర్ చేయటానికి అధికారం లేకుండా ప్రస్తుతం ప్రణాళిక సిద్ధం చేస్తోందట. అయితే ఎప్పుడు ఆ రూల్ అధికారికంగా ప్రకటిస్తుంది అనేది నిర్ణయం తీసుకోలేదట. నెట్ ఫ్లిక్స్ ట్రయల్‌లో, వినియోగదారులు టెక్స్ట్ లేదా ఇమెయిల్ ద్వారా పంపిన కోడ్ ద్వారా ఖాతాను యాక్సెస్ చేయడానికి అనుమతి లభిస్తుంది. ఇప్పుడు అలా కాదు నెట్‌ఫ్లిక్స్ అనర్హమైన వినియోగదారులను స్టాప్ చేసే ప్రయత్నంలో ఉంది. కానీ ఇప్పుడైతే నెట్ ఫ్లిక్స్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎంతమంది ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తున్నారో స్పష్టంగా తెలియలేదు. నెట్‌ఫ్లిక్స్, హెచ్‌బిఓ గో, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ ప్లస్ తో సహా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులకు పలు ప్రొఫైల్స్ జతచేయడానికి అనుమతినిస్తాయి. కానీ ఇప్పుడు అలా లేదు. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్ అనేది క్లోస్ చేయనున్నారు. ఇంతకుముందు నెట్ ఫ్లిక్స్ ఖాతా ఓపెన్ చేయడానికి మెయిల్, మెసేజ్ వచ్చేవి.. అలాగే డీటెయిల్స్ స్కిప్ చేయవచ్చు. కానీ త్వరలో ఆ మార్గం మూతబడుతుంది. ఖచ్చితంగా ఎవరి ప్రొఫైల్ వారే క్రియేట్ చేయడానికి మెయిల్స్ కంపల్సరీ అంటోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్ ఫ్లిక్స్ అభిమానులకు చేదువార్తె అని చెప్పాలి.
Tags:    

Similar News