'ఉయ్యాలా జంపాల' ఫేమ్ అవికా గోర్ - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ''నెట్''. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న జీ5 ఓటీటీలో ఈ సిరీస్ ని స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో తాజాగా 'నెట్' ట్రైలర్ ను 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విడుదల చేసి టీమ్ మొత్తానికి విషెస్ అందజేశారు.
ప్రియ (అవికా గోర్) అనే అమ్మాయి వ్యక్తిగత జీవితాన్ని.. లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) అనే వివాహిత వ్యక్తి సీక్రెట్ కెమెరాల ద్వారా చూస్తున్న నేపథ్యంలో వారిద్దరి లైఫ్ ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకుందనేది ''నెట్'' కథాంశం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ క్రమంలో లక్ష్మణ్ తన భార్య(సుచిత్రా పట్నాయక్) తో తరచూ గొడవ పడటం.. ప్రియ తన బాయ్ ఫ్రెండ్ (విష్ణు దేవ్) తో ఎంజాయ్ చేయడాన్ని లక్ష్మణ్ గమనిస్తుండటం వంటి సన్నివేశాలను చూపించారు.
అవికా గోర్ పర్సనల్ లైఫ్ ని సీక్రెట్ కెమెరాల ద్వారా రాహుల్ రామకృష్ణ ఎందుకు చూడాల్సి వచ్చింది? దీని వల్ల అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?, అవికా ని మోసం చేసిన వ్యక్తి ఎవరు? అనే విషయాలపై ఉత్కంఠ కలిగేలా ''నెట్'' ట్రైలర్ కట్ చేయబడింది. ఇప్పటి వరకు సినిమాలలో నవ్వించిన రాహుల్ రామకృష్ణ ఈ సిరీస్ లో సరికొత్త పాత్రలో కనిపిస్తున్నాడు. అలానే ట్రాప్ చేసి ఎవరో తన వ్యక్తిగత జీవితాన్ని చూస్తున్నారని తెలుసుకున్న అమ్మాయిగా బాగా నటించినట్లు తెలుస్తోంది.
వాస్తవిక సంఘటనల ఆధారంగా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా రూపొందిన ''నెట్'' వెబ్ సిరీస్ కు భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించారు. తమాడా మీడియా బ్యానర్ పై రాహుల్ తమాడా - సందీప్ రెడ్డి బోర్రా దీన్ని నిర్మించారు. వచ్చే నెల 10న జీ5 ఓటీటీలో ఈ ఒరిజినల్ సిరీస్ విడుదల కానుంది.
Full View