తెలుగులోకి నయన్ సూపర్ హిట్
కోలీవుడ్ లో షూటింగ్ షూటింగ్ జరుగుతున్నపుడు.. విడుదలకు ముందు, తర్వాత సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘నానుమ్ రౌడీ దా’. నయనతార కొత్త ప్రేమికుడు విఘ్నేష్ శివన్ రూపొందించిన సినిమాలో నయనే హీరోయిన్. ఈ షూటింగ్ సందర్భంగానే వీళ్లిద్దరూ ప్రేమలో పడటంతో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే వచ్చిందా సినిమా. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఆ అంచనాలకు తగ్గట్లే సూపర్ హిట్ అయింది. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. అతడి గాడ్ ఫాదర్ అనదగ్గ స్టార్ హీరో ధనుష్ తన సొంత బేనర్ లో నిర్మించడం విశేషం.
ఇప్పుడీ సినిమా తెలుగులోకి కూడా రాబోతోంది. ‘నానుమ్ రౌడీ దా’ అంటే ‘నేనూ రౌడీనే’ అని అర్థం. తెలుగు వెర్షన్ కు అదే టైటిల్ పెట్టారు. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి.. సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తారు. ధనుష్ స్వయంగా ఆడియో ఫంక్షన్ కు హాజరు కాబోతున్నాడు. తల్లి తనను పోలీసుగా చూడాలనుకుంటే.. రౌడీయిజం అంటే మోజు పడి రౌడీ సెటప్ పెట్టే హీరో కథ ఇది. ఇందులో నయన్ ఒక విచిత్రమైన పాత్ర చేసింది. ఆమె క్యారెక్టరే సినిమాకు హైలైట్. ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగే ఈ సినిమాను సరిగా ప్రమోట్ చేస్తే తెలుగులోనూ హిట్టయ్యే అవకాశముంది.