ఈ చిరుత పిల్లను చూస్తున్నారా...

Update: 2016-08-23 15:30 GMT
'చిరుత' సినిమాతో హీరోయిన్ గా మారింది మోడల్ నేహా శర్మ. కత్తిలాంటి ఫిజిక్ అనే పదానికి అచ్చుగుద్దిన పర్యాయపదంగా ఉండే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అంటే.. ఖచ్చితంగా ముందు ఈమె పేరు చెప్పాల్సిందే. కాని ఏం లాభం.. ఫేట్ మరోలా ఉంది మరి.

కత్తిలాంటి లుక్కులతో ఎంత పడేసినా కూడా.. నేహా శర్మకు టాలీవుడ్ లో బ్రేక్ మాత్రం రాలేదు. ఆ తరువాత అమ్మడు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుందాం అని ప్రయత్నించింది. హిందీలో ఏకంగా అరడజను సినిమాలు చేసింది. అయినాసరే బ్రేక్ మాత్రం రాలేదు. బికినీలు నుండి లిప్ కిస్సులు వరకు ఎన్నో ప్రయత్నించినా కూడా.. వర్కవుట్ కావట్లేదు. కాకపోతే నేహా మాత్రం రెగ్యులర్ గా వర్కవుట్లు చేస్తూ చాలా హాట్ లుక్స్ అలాగే మెయిన్టయిన్ చేస్తుంటుంది.

అప్పుడప్పుడూ అమెరికాలో మోడలింగ్ ఎస్సయిన్మెంట్లు చేసే ఈ హాటీ.. ఇప్పుడు కూడా అలాగే అమెరికాకు వెళ్లింది. ఖాళీ సమయాల్లో అక్కడ టూరిస్టులా దేశం అంతా చుట్టేస్తుంటుంది. అయినాసరే ఎంత హాటుగా అక్కడ చెక్కర్లు కొడుతుందో చూశారా? ముఖ్యంగా ఆమె ఫ్యాషన్ సెన్స్ చూస్తే ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే.
Tags:    

Similar News