• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  NBK 107: ఫ్యాన్స్ విజిల్...

NBK 107: ఫ్యాన్స్ విజిల్ వేసే ఫ్లాష్ బ్యాక్

By - Tupaki Desk
Update: 2022-07-19 02:30 GMT
అఖండ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ చూసిన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా గట్టిగానే పెంచేసుకున్నాడు. ఇక నెక్స్ట్ NBK 107 ను గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా పెంచుతున్నాయి. ఇదివరకే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఏ రేంజ్ లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు అందరికీ కూడా సినిమా విడుదల పై ఫోకస్ పడింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

సినిమాకు సంబంధించిన టైటిల్ విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే జై బాలయ్య టైటిల్ ఫైనల్ చేయాలి అని దర్శకుడు ఆలోచిస్తున్నాడు. కానీ ఇంకా బాలకృష్ణ నుంచి మాత్రం క్లారిటీ రాలేదు అని తెలుస్తోంది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారమైతే ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ చాలా హైలెట్ గా ఉండబోతోందని తెలుస్తోంది. సినిమా మొత్తంలో ఇంటర్వెల్ బ్లాక్ లోనే అసలైన సన్నివేశాలు ఉంటాయి అని అప్పుడే బాలయ్య కు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కూడా వస్తాయి అని ఒక టాక్ వినిపిస్తోంది. ఇక ఫ్యాన్స్ అప్పటినుంచి విజిల్స్ వేయడం మొదలు పెడితే సినిమా చివరి వరకు మాత్రం ఆపకుండా వేస్తారట.

పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ సినిమాగా దర్శకుడు ఈ సినిమాను తెరపైకి తీసుకు వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ అయితే దాదాపు 80 శాతం పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అసలైయితే ఈ సినిమాను ఈ ఏడాదే దసరా సమయంలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పటి లోపు షూటింగ్ పనులు పూర్తి కావని డిసెంబర్ కు షిఫ్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.
Tags:    
  • NBK 107 
  • Nandamuri Balakrishna 
  • Gopichand Malineni 
  • Actress Chandrika Ravi 
  • Chandrika Ravi Nbk 107 
  • Akhanda 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS