• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నజ్రియా ఎంట్రీ అంటే...

నజ్రియా ఎంట్రీ అంటే కుర్రమనసుల దోపిడీనే!

By - Tupaki Desk
Update: 2020-12-30 00:30 GMT
అందగత్తెలను ఆలస్యంగా చూడటం కంటే దురదృష్టం మరొకటి లేదు. అలాంటి దురదృష్టవంతులంతా వచ్చే ఏడాదిలో అదృష్టవంతులు కాబోతున్నారు. ఎందుకంటే వచ్చే ఏడాదిలో 'నజ్రియా నజీమ్' తెలుగు తెరకి వచ్చేస్తుంది కదా!. నాని కథానాయకుడిగా రూపొందనున్న 'అంటే సుందరానికి.. !' అనే సినిమా ద్వారా నజ్రియా నజీమ్ టాలీవుడ్ కి పరిచయం కానుంది. ఇప్పటివరకూ తమిళ .. మలయాళ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ, వచ్చే ఏడాదిలో వసంతంలా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

నజ్రియా .. మలయాళ తెరకి బాలనటిగా పరిచయమై, ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చేసి మన 'మీనా' మాదిరిగా హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ గా ఈ అమ్మాయిని చూసిన మలయాళీ ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇంతగొప్ప అందాన్ని ఇంతవరకూ చూడలేదంటూ మరింతగా కళ్లప్పగించారు. చురుకుదనంతో .. చలాకీదనంతో .. చామంతుల వంటి కళ్లను చక్రాల్లా తిప్పేస్తూ నజ్రియా గ్లామర్ గారడీ చేసేసింది. తమిళంలో చేసింది తక్కువ సినిమాలే అయినా, అక్కడ కూడా ఈ అమ్మాయి కుర్రాళ్ల  హృదయాలను లూటీ చేసేసింది.

వివాహమైన తరువాత గ్యాప్ తీసుకున్న ఈ అమ్మాయి మళ్లీ ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటికీ ఇప్పటికీ అదే గ్లామర్ అంటూ ఆమె అభిమానులు అదే ఆరాధనను కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నజ్రియా .. 'అంటే .. సుందరానికి!' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తమిళ .. మలయాళ భాషల్లో నజ్రియా నటించిన సినిమాలు చూసిన తెలుగు కుర్రాళ్లు,  'నీ కోల కళ్లకు నీరాజనాలు .. ఆ వాలు చూపుకు అభివందనాలు' అంటూ పాడుకున్నారు.

అలాంటి నజ్రియా ఇప్పుడు ఏకంగా తెలుగులోకే ఎంట్రీ ఇస్తోందంటే ఇంకా ఏమైనా ఉందా? వాళ్ల ఉరుకులకు కళ్లెం వేయడం .. వాళ్ల ఊహలపై దుప్పటి కప్పడం చాలా కష్టం. నిజంగానే నజ్రియా గొప్ప అందగత్తె .. అభినయం విషయంలోను ఆమెకి వంకబెట్టలేం. సీరియస్ గా ఆమె టాలీవుడ్ పై దృష్టిపెడితే మాత్రం ఇక్కడ గట్టిపోటీ ఇచ్చే ఛాన్స్  ఉంది. మరి నజ్రియా ఇక్కడ కసితో అడుగుపెడుతుందో .. కాలక్షేపానికి అడుగుపెడుతుందో చూడాలి.     
Tags:    
  • Nazriya Nazim 
  • Nazriya Nazim Movies 
  • Nazriya Nazim Updates 
  • Nazriya Nazim Pics 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS