ఏంటి సీక్వెల్ కూడా తీస్తున్నారా
కమర్షియల్ సినిమాలతో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాల్లోనూ అదరగొట్టేస్తూ లేడీ సూపర్ స్టార్ అనే టైటిల్ సంపాదించింది నయనతార. ఈ పాత్రకు నయనతార అయితే మాత్రమే న్యాయం చేయగలదు అనేంతగా మెప్పిస్తోంది. తాజాగా ఆమె తమిళంలో చేసిన అరం సినిమాకు ఓ రేంజిలో ప్రశంసలు వచ్చాయి. నయనతార ఇందులో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని డ్యూటీకి న్యాయం చేసే కలెక్టర్ గా కనిపించింది.
అరం సినిమా తెలుగులో కర్తవ్యం పేరుతో విడుదలైంది. జనజీవితాన్ని ప్రభావితం చేసే అంశంతో ఈ సినిమా వచ్చినా కేవలం నయనతారకున్న ఇమేజ్ వల్లే ఈ మూవీకి తమిళంతోపాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లు వచ్చాయి. దీంతో అరం సినిమాకు సీక్వెల్ తీయడానికి ఫిలిం మేకర్లు రెడీ అయిపోయారు. కర్తవ్యం సినిమా అంతా మారుమూల పల్లెలో నీటి సమస్య చుట్టూ తిరుగుతుంది. రెండో పార్ట్ పల్లెల్లో ఈనాటికీ ఉన్న కులవివక్ష ఆధారంగా ఉంటుందని తెలుస్తోంది.
అరం మూవీ ప్రొడ్యూస్ చేసిన కె.జె.ఆర్. స్టూడియోస్ బ్యానర్ పైనే నిర్మాత కోటపడ రాజేష్ రెండోపార్ట్ నిర్మించనున్నారు. డైరెక్టర్ గోపినాయర్ ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన కలెక్టర్ పాత్రలో మరోసారి నయతారను వెండితెరపై చూసేయొచ్చు.