రౌడీ మీదనే ఆశలు పెట్టేసుకుంది
గత కొంతకాలంగా నయన తార తెలుగులో హిట్ కొట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఈమెకు ప్రభుదేవాకి చెడిన తర్వాత, టాలీవుడ్ లో అమ్మడి కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. రెండింటికీ లింక్ లేకపోయినా, సెంటిమెంట్స్ రాజ్యం చేసే సినిమా ఇండస్ట్రీలో ఇది కూడా పెద్ద పాయింటే. కానీ తమిళంలో మాత్రం మాంచి బూమ్ లో ఉంది. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చేసి టాప్ రేంజ్ కి చేరిపోయింది.
తమిళ్ లో నయన్ కొట్టిన మూడు బ్లాక్ బస్టర్లలో ఒకటి నానుం రౌడీ దాన్. దీన్ని ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చేశారు. నేనూ రౌడీనే అనే టైటిల్ తో ఈ మూవీ తెలుగులో రిలీజ్ కానుంది. ఈనెల 29న నేనూ రౌడీనే మూవీని విడుదల కానుంది. ఈ సినిమాను నయన్ కొత్త బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేయగా.. విజయ్ సేతుపతి హీరో. అయితే రీసెంట్ గా తెలుగులో నయన్ కి ఒక్క హిట్ కూడా లేదు. కృష్ణం వందే జగద్గురుం, అనామిక చిత్రాలకు మంచి రివ్యూలు వచ్చాయి. ఓకె బాగున్నాయనే టాక్ కూడా వచ్చినా.. కమర్షియల్ మాత్రం నిరాశను మిగిల్చాయి. మరోవైపు ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న తెలుగు సినిమా ఒకటే. విక్టరీ వెంకటేష్ హీరోగా మారుతీ డైరెక్షన్ లో రానున్న మూవీలో నయన తారనే హీరోయిన్ గా తీసుకున్నారు.
ఇది కాకుండా మెగాస్టార్ రీఎంట్రీ కోసం సిద్ధమవుతున్న కత్తి రీమేక్ కోసం కూడా నయన్ నే అప్రోచ్ అయ్యారు. అయితే. దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం లేదు. ఇప్పుడు విడుదల కానున్న నేనూ రౌడీనే హిట్ అయితే.. అమ్మడికి మరోసారి టాలీవుడ్ లో క్రేజ్ వస్తుందని టాలీవుడ్ అంచనా వేస్తోంది.