డ్రగ్స్ అమ్మే కోకిలగా నయన్

Update: 2018-07-02 05:45 GMT
నయనతార కీలక పాత్రలో రూపొందిస్తోన్న కొలమావు కోకిల ప్రస్తుతం కోలీవుడ్  లో హాట్ టాపిక్ గా మారింది. నెల క్రితం విడుదలైన ఆడియో సింగిల్ లో కమెడియన్ యోగి బాబు నయన్ ల మధ్య కెమిస్ట్రీకి మిలియన్ల కొద్దీ వ్యూస్ వరదలా వచ్చి పడ్డాయి. ఇటీవలే దీనికి సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. మొదట ఎ సర్టిఫికెట్ ఇచ్చి ఆ తర్వాత దర్శకుడు నెల్సన్ తో పాటు నిర్మాణ సంస్థ లైకా చేసిన పోరాటం వల్ల యు/ఎ తెచ్చుకుంది.అది కూడా కొన్ని కట్స్ తో. ఇది నచ్చని నిర్మాత ఇప్పుడు రివైజింగ్ కమిటీకి వెళ్లి కట్స్ లేకుండా ఓకే చేయించుకోవాలనే  ప్లాన్ లో ఉన్నాడట. అదలా ఉంచితే నయనతార ఇందులో డ్రగ్స్ అమ్మే పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

పైకి అమాయకంగా ఉంటూనే మత్తు మహమ్మారిని అమ్మే పాత్రలో నయనతార చాలా కొత్తగా కనిపిస్తుందని టాక్ ఇప్పటికే తమిళనాట జోరుగా సాగుతోంది. అసలు నయనతార యోగిబాబు పక్కన నటించడానికి ఒప్పుకోవడమే పెద్ద సెన్సేషన్ దర్శకుడు నెల్సన్ కి ఇది మొదటి సినిమా. గతంలో శింబు-దీక్ష సేత్ జంటగా ఒక మూవీ స్టార్ట్ చేసాడు కానీ అది సగం నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. కొంత గ్యాప్ తర్వాత ఈ కొలమావు కోకిలతో వస్తున్నాడు నెల్సన్. డార్క్ కామెడీ నేపధ్యంలో రూపొందిన ఈ సినిమాలో నయనతార చెల్లిగా టీవీ యాక్టర్ జాక్వెలిన్ పరిచయం కాబోతోంది. ఇతర పాత్రల్లో శరణ్య - నవీన్ కుమార్ నటిస్తున్నారు.

అజ్ఞాతవాసి ఫేమ్ అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్స్ లోకి చేరిపోయింది. ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతున్న కొలమావు కోకిల తెలుగు డబ్బింగ్ వెర్షన్ గురించి ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి కట్స్ చెప్పి ఎ సర్టిఫికెట్ ఇచ్చేంత విషయం ఇందులో ఏముందో తెలియాలంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.
Tags:    

Similar News