నయన్ పెళ్లి జస్ట్ ఫార్మాలిటీనా?
ఇటు తెలుగులో అటు తమిళ్ లో వరస ఆఫర్ల యమా బిజీగా ఉన్న నయనతార చాలా కాలం నుంచే దర్శకుడు విజ్ఞేశ్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ళ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అనే దాని మీద ఇప్పటికే చెన్నై మీడియాలో కొన్ని వేల కథనాలు వచ్చి ఉంటాయి. అయినా కూడా ఈ ప్రేమ జంట ఇప్పటిదాకా అధికారికంగా ఒక్కసారి కూడా స్పందించలేదు.
సహజీవనం చేస్తున్నారని ఒకసారి లేదు పెళ్లి తప్ప అంతా అయ్యిందని మరోసారి ఏవేవో ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నవంబర్ లో ఈ ఇద్దరి పెళ్లి జరగబోతోందన్న టాక్ ఊపందుకుంది. డేట్ ఫిక్స్ అయ్యిందని ఆ టైం కంతా ఇద్దరి కమిట్ మెంట్స్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నారని ఇలా ఏదేదో చెప్పేస్తున్నారు
కాని నయనతార తీరు చూస్తుంటే మాత్రం దాని పట్ల అంతగా ఆసక్తి లేనట్టుగా కనిపిస్తోంది. దానికి కారణం విపరీతమైన బిజీలో ఉండటమే రజనీకాంత్ దర్బార్ విజయ్ 63 షూటింగ్స్ కోసం అటు ఇటు తిరుగుతూ బిజీగా ఉన్న నయన్ చిరంజీవితో మొదటిసారి చేసిన సైరాలో తన వర్క్ ను పూర్తి చేసుకున్నట్టే. ఏవో రెండు మూడు సీన్లు బాలన్స్ అంటున్నారు కాని అవి కూడా ఈ నెలలోనే కానిచ్చేలా ఉన్నారు.
ఇవి కాకుండా నయన్ ఓకే చెప్పిన ప్రాజెక్ట్స్ మరో మూడు దాకా ఉన్నాయి. సూర్య గ్యాంగ్ తర్వాత గ్యాప్ తీసుకున్న విజ్ఞేశ్ శివన్ త్వరలో శివ కార్తికేయన్ హీరోగా కొత్త సినిమా మొదలుపెట్టబోతున్నాడు. అందులో తన కాబోయే భార్య నయనే హీరొయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇదంతా చూస్తుంటే నవంబర్ లో అయినా నయన్ పెళ్లి జరగడం డౌటే