నయన్‌ కు మంచి ఛాన్స్‌ మిస్సయింది

Update: 2019-02-24 08:01 GMT
గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు చిన్నా పెద్ద కలిపి చాలా సినిమాలు వచ్చాయి. 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' చిత్రంతో 'మిఠాయి' మరియు 'అంజలి సిబిఐ' చిత్రాలు కూడా వచ్చాయి. మహానాయకుడు చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా ప్రేక్షకులు మాత్రం వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. మిఠాయి సినిమాను పట్టించుకునే నాధుడే లేడు. 'అంజలి సిబిఐ' చిత్రంకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా పబ్లిసిటీ సరిగా చేయని కారణంగా ఆ సినిమాను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

అంజలి సిబిఐ గురించి అసలు ప్రేక్షకులకు పెద్దగా తెలియడం లేదు. తమిళంలో ఇదే సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో కూడా పబ్లిసిటీ ఇంకాస్త ఎక్కువ చేస్తే తప్పకుండా మంచి ఫలితాన్ని రాబట్టేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నయనతారకు తెలుగులో మంచి క్రేజ్‌ ఉంది. ఆ క్రేజ్‌ ను అంజలి సిబిఐ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్‌ చేసిన నిర్మాతలు వినియోగించుకోవడంలో విఫలం అయ్యారు.

ఈ చిత్రంలో నయనతారతో పాటు తెలుగులో ఇప్పటికే హీరోయిన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న రాశిఖన్నా నటించింది. ఇంకా విజయ్‌ సేతుపతి మరియు అనురాగ్‌ కశ్యప్‌ లు కూడా ఈ చిత్రంలో ఉండటంతో సినిమాకు తమిళనాట మంచి క్రేజ్‌ వచ్చింది. అయితే తెలుగులో దాన్ని పబ్లిసిటీ చేయడంలో విఫలం అయ్యారు. ప్రముఖ స్టార్స్‌ ఉండి, పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా 'అంజలి సిబిఐ'కి పబ్లిసిటీ లేని కారణంగా కలెక్షన్స్‌ పరంగా నిరాశ మిగిలింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలు ఏమీ లేని సమయంలో అంజలికి కాస్త పుషప్‌ ఇచ్చి ఉంటే మంచి వసూళ్లు నమోదు అయ్యేవి. మంచి ఛాన్స్‌ ను నిర్మాతలు మిస్‌ చేసుకున్నారు.

Tags:    

Similar News