ప్రేమ కోసం దేనికైనా సిద్దమే: నయన్
ప్రేమలో ఉన్న వారి మధ్య ఏ ఒక్కరితోనో సమస్య తలెత్తినా - చిన్నచిన్న అపార్థాలూ - మనస్పర్థలు వచ్చినా.. అవి ఒక దశవరకూ భరించవచ్చు కానీ.. అవి మరీ శృతిమించి భరించలేనంతగా మారితేమాత్రం.. విడిపోవడం అంత సుఖం లేదంటోంది అందాలతార నయనతార. ప్రేమవిషయంలో పుష్కలమైన అనుభవం సంపాదించిన నయనతార... తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించింది. ఇలాంటి భరించలేనంత మనస్పర్ధలు తాను ప్రేమలో ఉన్నప్పుడు కూడా వచ్చాయని.. వాటివల్లే ఆ సమయంలోనే విడిపోవాలని నిర్ణయించుకున్నానని ఇలా తన ప్రేమ - వాటిలో ఎదురైన అనుభవాలను నయనతార తాజాగా చెప్పుకొచ్చింది.
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రేమవ్యవహారల విషయంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరోయిన్స్ లో నయనతారది ప్రత్యేక స్థానమనే చెప్పాలి. అప్పట్లో శింబుతో ప్రేమవ్యవహారం - లిప్ లాక్ లు - వాటికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీకులు... ఈ రేంజ్ లో నయన మొదటి లవ్ స్టోరీ సంచలనాలు సృష్టించింది. అయితే పెళ్లివరకూ వెళ్తుందని భావించిన ఈ వ్యవహారం "అన్ సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ"గానే మిగిలిపోయింది. అనంతరం ప్రభుదేవాతో డీప్ లవ్ లో పడిపోయింది నయనతార.
శింబుతో ప్రేమ ఫెయిల్ విషయంలో అంత డిప్రెషన్ కు వెళ్లినట్లు అనిపించని నయన... ప్రభుదేవ తో ప్రేమ వ్యవహారం ఫెయిలయిన తర్వాత మాత్రం ఫుల్ డిప్రెషన్ కి వెళ్లిపోయింది. దానికి కూడా కారణాలు లేకపోలేదు... ప్రభుదేవతో నయనతార సంబందం ప్రేమవరకే కాదు - సహజీవనం వరకూ కూడా వెళ్లింది. అనంతరం విడిపోయారు... దీంతోనే నయన్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ సమయంలో కేవలం సినిమాలు మాత్రమే తన డిప్రెషన్ కు విరుగుడు అని స్నేహితులు - శ్రేయోభిలాషులు నయనకు చెప్పడంతో.. తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయిందట.
అయితే.. ప్రభుదేవతో ప్రేమలో ఉన్నప్పుడు తాను చేసిన త్యాగాల గురించి - ప్రభుదేవాను తాను ఏ స్థాయిలో ప్రేమించాననే విషయాన్ని చెబుతూనే.. ప్రేమలో ఇరువైపులా ఇచ్చిపుచ్చుకునే పరిస్థితులు ఉండాలని చెప్పింది నయనతార. ఓ దశలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమవుదామనుకునే స్థాయి నిర్ణయం కూడా నయన అప్పట్లో తీసుకున్నారట. ప్రేమ కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనన్న విషయం అవతలి వ్యక్తికి తెలియజేయాలని ఆ నిర్ణయం తీసుకున్నా కానీ.. అది అర్ధం చేసుకునే మనసు అవతలి వ్యక్తికి లేకుండాపోయిందనే విషయాన్ని చెప్పకనే చెప్పింది నయనతార. అయితే.. నయనతార ఇచ్చిన విలువను - పెంచుకున్న నమ్మకాన్ని ప్రభుదేవ నిలుపుకోలేకపోయాడా? ఈమెను అర్ధం చేసుకోలేకపోయాడా? ఏమో.. కానీ.. వీరిద్ధరూ విడిపోయారు. నయన తాజాగా ఈ విషయాలనే చెప్పింది. తన ప్రేమ ఫెయిలవ్వడానికి గల కారణాలను అలా వివరించింది. ప్రేమకోసం ఏమైనా చేయడానికి తన మనసు సిద్ధమనే విషయాలను తెలిపింది.