అందంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గులాబీబాల!!

Update: 2021-01-15 13:52 GMT
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా ద్వారా తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ తెలుగువారి మనసులను గెలుచుకుంటుంది. సంప్రదాయంగా చీరకట్టులో ముస్తాబై గులాబీ రంగు చీరలో ఫిదా చేస్తోంది. ఈ ట్రెడిషనల్ లుక్ చూసి సోషల్ మీడియాలో విపరీతంగా నయనతార పై ప్రేమను కురిపిస్తున్నారు అభిమానులు. బంగారు ఆభరణాలతో వెలిగిపోతున్న నయనతార పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పింక్ సారీలో మైమరిపించే అందంతో ఈ 2021 సంక్రాంతి పండుగను సంథింగ్ స్పెషల్ గా మార్చింది నయన్ అంటున్నారు నెటిజన్లు. సాధారణ హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన నయన్.. ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ అనే స్థాయికి చేరింది.

గత కొన్నేళ్ల నుండి నయన్ గ్లామర్ పాత్రలకు నో చెప్పేసి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ వెళుతోంది. సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది నయన్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నయనతార పలు సినిమాలతో బిజీగా ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నతే, అలాగే తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో 'కాతు వాకుల రెండు కాదల్' సినిమాలు చేస్తోంది. ఈ సినిమాలో నయనతార తో పాటు స్టార్ హీరోయిన్ సమంత, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించనున్న లూసిఫర్ రీమేక్ లో కోసం కూడా నయనతారను సంప్రదించినట్లు సమాచారం. చూడాలి మరి లేడీ సూపర్ స్టార్ ఏం చేయనుందో.. ఇకపొతే ఈ సంక్రాంతి ట్రీట్ మాత్రం అదిరింది అంటున్నారు ఫ్యాన్స్.
Tags:    

Similar News