బిగ్‌ బి భార్యపైనే నెటిజన్‌ వెటకారం.. సీరియస్‌ గా స్పందించిన కూతురు

Update: 2021-02-17 08:30 GMT
బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కూతురు నవ్య నవేలీ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటారు. ఆమె సుదీర్ఘ కాలంగా స్త్రీ సమానత్వం గురించి పోరాటం చేస్తున్నారు. అలా రెగ్యులర్‌ గా ఆ విషయమై ఏదో ఒక పోస్ట్‌ చేస్తూనే ఉంటారు. తాజాగా కూడా స్త్రీ సమానత్వం మరియు సమాజంలో స్త్రీకి దక్కుతున్న గౌరవం గురించి అమితాబచ్చన్‌ కూతురు అయిన నవ్య నవేలీ స్పందించింది. ఆ పోస్ట్‌ కు ఒక నెటిజన్‌ స్పందిస్తూ మీ అమ్మ ఎలాంటి ఉద్యోగం లేకుండా ఖాళీగానే ఉంది కదా అంటూ ప్రశ్నించాడు. అతడి వెటకారపు పోస్ట్‌ పై నవ్య నవేలీ చాలా సీరియస్ అయ్యింది.

అతడి పోస్ట్‌ కు నవ్య సీరియస్‌ గా స్పందిస్తూ.. ఆమె ఒక రచయిత... డిజైనర్‌.. భార్య ఇంకా తల్లి గా విధులు నిర్వహిస్తుంది. ఒక తల్లిగా భార్యగా కుటుంబ బాధ్యతలు చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ విషయంను ఆమె చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. భార్య పోస్ట్ అంటే ఫుల్‌ టైమ్‌ జాబ్ వంటిదే. ఇంటి పనులతో బిజీగా ఉండే వారిని చులకనగా చూడటం మానేయండి. ఒక తరం మొత్తం కూడా వారి బాధ్యతపైనే ఆదారపడి ఉంటుంది. వారు సక్రమంగా పిల్లలను పెంచితే ఈ తరంతో పాటు తదుపరి తరం కూడా బాగుంటుంది. అందుకే ఆడవారిని చులకనగా చూడటం మానేయాలంటూ అతడికి సీరియస్ వార్నింగ్‌ ఇచ్చింది.
Tags:    

Similar News