నవదీప్ ను టెన్షన్ పెట్టేశాడుగా!!

Update: 2017-08-21 10:55 GMT

బిగ్ బాస్ షో హోస్టింగ్ చేస్తున్న ఎన్టీఆర్.. రోజురోజుకూ తన పద్దతిని మార్చేస్తున్నాడు. మొదట్లో మాత్రం ఏదో రాసిన డైలాగులను అప్పజెప్పినట్లు ఫాలో అయ్యాడు కాని.. ఇప్పుడు మాత్రం తనదైన శైలితో ఆకట్టుకుంటున్నాడు. అదిగో నిన్న నవదీప్ ను ఎన్టీఆర్ ఆటపట్టించిన తీరు అందరికీ భలే కిక్కిచ్చిందిలే.

నిజానికి నవదీప్ బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వగానే నానా రచ్చచేశాడు. ఇప్పుడు దానికి కౌంటర్ గా ఎన్టీఆర్ కూడా పిచ్చెక్కించాడు. నిన్న సడన్ గా నవదీప్ మీ ఇంట్లో జరిగిన రైడ్ లో పాత 500 నోట్లు 1000 నోట్లు దొరికాయంట.. నిన్ను ఇన్వెస్టిగేషన్ కు రమ్మంటున్నారు.. ఐదు నిమిషాల్లో ప్యాకింగ్ చేసుకుని వచ్చేయ్ అంటూ చెప్పాడు. దానితో నవదీప్ నిజంగానే ప్యాకింగ్ కు రెడీ అయిపోయాడు. అందరూ అది నిజమనే అనుకున్నారు. అయితే తాను సరదాగా ఆటపట్టిస్తున్నానని ఎన్టీఆర్ అనడంతో అందరూ నవ్వేశారు. ''మొన్న నువ్వు కొత్త 1000 నోట్లు రిలీజయ్యాయ్ అంటూ అందరికీ చెప్పి కామెడీ చేయలేదు.. అలాగే నేను కూడా టీజ్ చేశా'' అని ఎన్టీఆర్ చెప్పడంతో నవదీప్ కూడా నవ్వుకున్నాడు.

మొత్తానికి బిగ్ బాస్ కార్యక్రమాన్ని మొత్తంగా తన చేతిల్లోకి తీసుకుని ఎన్టీఆర్ భలే ఎంజాయ్ చేస్తూ ఈ హోస్టింగ్ చేస్తున్నాడులే. ఇక రాను రాను ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్స్ ఎక్కువైపోయి కంటెస్టంట్లు తగ్గిపోతారు కాబట్టి.. ఎన్టీఆర్ ఎలా నడిపిస్తాడు అనేదానిపైనే ఈ షో రేటింగ్స్ ఆధారపడి ఉంటాయ్. అది సంగతి. 
Tags:    

Similar News