ఆ యాడ్ నిన్ను చూసే తీశా.. నవదీప్​ ను ఆటపట్టించిన అల్లు అర్జున్​

Update: 2020-11-14 10:10 GMT
థియేటర్లు మూతపడటంతో ఓటీటీ దందా ఓ రేంజ్​లో దూసుకెళ్తున్నది. ప్రస్తుతం థియేటర్లకు ప్రభుత్వాలు అనుమతిచ్చినా.. ప్రేక్షకులు వెళతారో లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికే తమిళనాడు సర్కార్​  సినిమాహాళ్లు తెరుచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులు చాలా తక్కువగా వెళ్తున్నారు. సీఎం కేసీఆర్​ కూడా ఇటీవల సినీ హీరోలు చిరంజీవి, నాగర్జునతో సమావేశమయ్యారు. థియేటర్లు ఒపెన్​ చేసేందుకు ఆయన ఓకే చెప్పారు. అయితే ప్రేక్షకులు ఏమేరకు  వెళ్తారన్నదే డౌటే. ఈ నేపథ్యంలో ఓటీటీ దూసుకుపోతున్నది.ఇప్పుడు నిర్మాతలు కూడా  ఓటీటీ ఫ్లాట్‌ఫాంలతో  భాగమయ్యారు. ఓటీటీలో షోలు, సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు.

 అయితే అమేజాన్ ప్రైమ్​, నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ ఓటీటీ సంస్థలకు దీటుగా.. తెలుగుదనం ఉట్టిపడేలా అల్లు అరవింద్ ఆహాతో ముందుకు వచ్చాడు.ఈ మధ్యకాలంలో ఆహా యాప్ జనాదరణ పొందడంలో ముందడుగు వేస్తోంది. ఆహాలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. కృష్ణ అండ్ హిజ్ లీలా, భానుమతి రామకృష్ణ వంటి సినిమాలు హిట్ అయ్యాయి. ఇటీవల విడుదలైన ‘కలర్​ఫొటో’ చిత్రానికి కూడా మిశ్రమ స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఆహాను మరింత వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అల్లు అర్జున్​ రంగంలోకి దిగాడు.  ఆహా కోసం అల్లు అర్జున్ స్పెషల్ షోలు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఆహాకు పునాది ఎలా జరిగింది? ఎవరెవరు ఇందులో భాగస్వామి అయ్యారన్న సంగతులన్నీ చెప్పాడు.
అల వైకుంఠపురములో సినిమా సమయంలో ఆహా టీం తన వద్దకు వచ్చిందని, ఏదో ఒకటి చేయాలని అన్నారట. అందుకే త్రివిక్రమ్‌తో కలిసి ఓ స్పెషల్ యాడ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.

 ఆ యాడ్ గురించి చెబుతూ నవదీప్​ను దృష్టిలో ఉంచుకొనే ఆ యాడ్​ను తెరకెక్కించనట్టు అల్లు అర్జున్​ చెప్పాడు.  ఇంతకీ ఆ యాడ్​లో ఏముందంటే.. ఓ ఇంట్లో తన ప్రియురాలి ఒంటరిగా ఉండటంతో బన్నీ వెళ్తాడు. ఆమెతో రొమాన్స్ చేయాలని ప్రయత్నిస్తుంటే అమ్మాయి నాన్న వస్తాడు. డోర్​ ఎంత సేపు కొట్టినా తీయకపోవడంతో ఇంట్లోకి వచ్చి..  ఎవరైనా అబ్బాయి ఉన్నాడా? అంటూ మంచం కింద చూస్తాడు తండ్రి.  అప్పుడు బన్నీ కప్​బోర్డులో దాక్కుంటాడు. అయితే ఆ తరువాత ఆమె  అన్న వచ్చి కప్ బోర్డ్‌లో వెతుకుతాడు. అప్పడు కూడా బన్నీ కనిపించడు. ఆ తర్వాత ఆ అమ్మాయి రాత్రంతా ఒక్కడివే ఎలా ఉన్నావు అని అడగడంతో ఆహా చూస్తూ కుర్చున్నానని చెబుతాడు బన్నీ. ‘ఆ యాడ్‌ కు నవదీప్ స్ఫూర్తి.. అయితే ఇంట్లో దూరడం, ప్రేయసితో రొమాన్స్ చేయడం ఇవన్నీ నవదీప్‌కు సూట్ అవుతాయి. అందుకే అతడిని చూసే ఇలా తీశాం’ అని అల్లు అర్జున్ అనడంతో నవదీప్ కూడా పగలబడి నవ్వేశాడు.
Tags:    

Similar News