• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య షో కు గెస్టుగా...

బాలయ్య షో కు గెస్టుగా నేచురల్ స్టార్..?

By - Tupaki Desk
Update: 2021-10-30 00:30 GMT
నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ కోసం అభిమానులతో పాటుగా ఇండస్ట్రీ జనాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' కోసం బాలయ్య ''అన్ స్టాపబుల్'' అనే టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ప్రోమో ఈ షో మీద ఆసక్తిని రెట్టింపు చేశాయి. సినిమా ట్రైలర్ కు మించి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రోమోని చూపించారు.

దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీ నుంచి ''అన్ స్టాపబుల్ విత్ NBK'' షో ఆహా యాప్ లో ప్రసారం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఇందులో పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఫస్ట్ గెస్ట్ గా రాబోతున్నారు. అలానే బాలయ్య షో లో నేచురల్ స్టార్ నాని కూడా పాల్గొనబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ మీద నాని ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంలో బాలయ్య ఫ్యాన్ గా నాని అలరించిన సంగతి తెలిసిందే. అలానే సినిమా పరంగా ఇద్దరికీ ఓ సారూప్యత ఉంది. బాలయ్య హీరోగా నటించిన 'బంగారు బుల్లోడు' 'నిప్పు రవ్వ' సినిమాలు ఒకే రోజు విడుదలైతే.. నాని 'ఎవడే సుబ్రహ్మణ్యం' 'జెండా పై కపిరాజు' చిత్రాలు కూడా ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి.

ప్రస్తుతం వీరిద్దరు చేస్తున్న 'అఖండ' 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలు రెండూ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నాయి. ఇప్పటికే డిసెంబర్ 24వ తేదీని నాని ప్రకటించారు. మరి బాలయ్య కూడా అదే రోజున రావాలని అనుకుంటే మాత్రం నాని వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో బాలకృష్ణ హోస్ట్ చేసే 'అన్ స్టాపబుల్' షో కు నాని గెస్ట్ గా హాజరవుతారని రూమర్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇకపోతే బాలయ్య షో కు రాబోయే రోజుల్లో రానా దగ్గుబాటి - పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ లతో పాటుగా మెగా హీరోలు కూడా హాజరవుతారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే బాలకృష్ణ డిజిటల్ డెబ్యూ స్పెషల్ గా నిలిచే అవకాశం ఉంది. సై అంటే సై.. నై అంటే నై.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ వస్తున్న నటసింహం.. 'అన్ స్టాపబుల్' షో తో ఎలా అలరిస్తారో చూడాలి.
Tags:    
  • Nani 
  • Unstoppable With NBK 
  • AHA 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS