రివ్యూలతో ది హిందు..హిందూస్తాన్ టైమ్స్ రచ్చ!

Update: 2019-06-23 01:30 GMT
'కబీర్ సింగ్' రిలీజ్ కావడంతోనే రివ్యూలపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ స్టార్ట్ అయింది. అంటే రివ్యూలు మంచివా చెడ్డవా అన్నది కాదు ఇక్కడ పాయింట్.  'కబీర్ సింగ్' కంటే సెక్స్.. వయోలెన్స్ ఎక్కువ ఉన్న సినిమాలకు సూపర్ రేటింగులు ఇచ్చిన బాలీవుడ్ క్రిటిక్స్ 'కబీర్ సింగ్' ను ఎందుకు చీల్చి చెండాడుతున్నారో చాలామందికి అర్థం కావడంలేదు.  షాహిద్ సినిమా 'ఉడ్తా పంజాబ్' లో డ్రగ్స్ సమస్య.. విపరీతమైన మనస్తత్వం ఉన్న హీరో పాత్ర ఉంటుంది. దాన్ని క్లాసిక్ అన్నారు.  ఇక 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' లో ఉండే వయోలెన్స్ అందరికీ తెలిసిందే. అయితే వాటిని మెచ్చుకొని 'కబీర్ సింగ్' మాత్రమే సమాజానికి చెడు చేస్తుందని అనడం చాలామందికి అంతు చిక్కడం లేదు.

ఇదంతా ఒక ఎత్తు. ఇండియాలో లీడింగ్ న్యూస్ డైలీస్ లిస్టులో ఉన్న 'ది హిందు'.. 'హిందుస్తాన్ టైమ్స్' ఇచ్చిన 'కబీర్ సింగ్' రివ్యూలను సోషల్ మీడియాలో నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. కారణం నెగెటివ్ రేటింగ్ ఇచ్చారు అని కాదు.  తెలుగు 'అర్జున్ రెడ్డి' ని కళాఖండం అని మెచ్చుకున్న ఈ పేపర్లే 'కబీర్ సింగ్' ను చెత్త సినిమా అని విమర్శలు గుప్పించాయి.  తెలుగు వెర్షన్ కు హిందీ వెర్షన్ కు కథ పరంగా మహా అంటే ఓ 10 లేదా 20 శాతం మార్పు ఉంటుందేమో. మిగతా అంతా సేమ్ టూ సేమ్. అలాంటప్పుడు ఇంత పెద్ద సంస్థలలో వచ్చిన రివ్యూలలో అంత తేడా ఎందుకు ఉంది?

ఒకవేళ 'కబీర్ సింగ్' చెత్తే అనుకుందాం.. అలాంటప్పుడు 'అర్జున్ రెడ్డి' కి రివ్యూ ఇచ్చిన సమయంలో చెత్త అని చెప్పాలి కదా.  అక్కడ అలా ఇక్కడ ఇలా.. అలా ఎలా..?  ఇప్పటివరకూ మన తెలుగులో పేపర్లకే ఇలాంటి జాడ్యాలు ఉన్నాయని చాలామంది అనుకునేవారు. 'ది హిందు' లాంటి సంస్థలో ఇలాంటి పరస్పర వ్యతిరేకమైన రివ్యూలు రావడం మాత్రం నిజంగానే  చాలామందిని షాక్ కు గురిచేసింది. నెటిజన్లు ఈ విషయంపై తీవ్రంగా మండిపడుతున్నారు.
Tags:    

Similar News