నేషనల్ మీడియా కవరేజ్ పెరిగింది బాసూ

Update: 2017-01-11 12:54 GMT
సాదారణంగా సౌత్ ఇండియా సినిమాలపై నేషనల్ మీడియా కవరేజ్ చాలా తక్కువ అనే కంటే ఉండదు అంటేనే కరెక్ట్ గా ఉంటుందేమో! సాదారణంగా సౌత్ ఇండియా సినిమాలంటే తమిళ సినిమాలకు మాత్రమే కవరేజ్ బాగుండేది. అది మినహా మిగిలిన సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలపై వారి చిన్న చూపు ఎప్పుడూ కంటిన్యూ అవుతూ ఉండేది. అయితే రాజమౌలి వండర్ "బాహుబలి" తో నేషనల్ మీడియా సౌత్ లో టాలీవుడ్ వైపు కూడా చూడటం మొదలుపెట్టింది. ఈ చూపు కంటిన్యూ చేస్తూ తాజాగా బాలయ్య "గౌతమిపుత్ర శాతకర్ణి" సినిమాతో పాటు "ఖైదీ నెం 150" పై కూడా ఫోకస్ పెట్టింది.

ఈ క్రమంలో ఇండియా టుడే "ఖైదీ నంబర్ 150"పై స్పెషల్ కవరేజ్ ఇస్తుండడం విశేషం. ఈ సందర్భంగా చిరంజీవికి వచ్చిన అవార్డుల దగ్గరనుంచి.. 150వ సినిమాకి "ఖైదీ నంబర్ 150" అనే టైటిల్ పెట్టడం వెనక రీజన్స్ వరకూ ఇండియా టుడే ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది.

ఈ విషయంలో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా దేశ చరిత్రకు సంబందించిన సినిమా కావడంతో తాజాగా ఎన్డీటీవీ శాతకర్ణి టీం తో ఏకంగా చిట్ చాటే చేసింది. తెలుగు సినిమా టీం తో నేషనల్ మీడియా ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రోగ్రాంస్ చేసిన సందర్భాలు లేవనే చెప్పాలి!! అయితే తాజాగా బాలకృష్ణ - శ్రేయ - క్రిష్ లతో ఎన్డీటీవీ ఇంటర్వ్యూ చేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే నిన్న బాహుబలి - నేడు శాతకర్ణి - ఖైదీ నంబర్ 150 సినిమాలతో నేషనల్ మీడియా కవరేజ్ సౌత్ ఇండియాలో టాలీవుడ్ సినిమాలపై బాగానే దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News