మన జేపీ కోసం తెలుగులో ట్వీట్‌ చేసిన ప్రధాని

Update: 2020-09-08 11:30 GMT
టాలీవుడ్‌ లో విలన్‌ గా కమెడియన్‌ గా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో కనిపించిన జయప్రకాష్‌ రెడ్డి అలియాస్‌ జేపీ బాత్‌ రూంలో గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతి పట్ల టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులు అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు సినిమా పరిశ్రమకు పెద్ద లోటు.. ఆ లోటును ఎవరు భర్తీ చేయలేరు అంటూ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సోషల్‌ మీడియాలో జేపీకి పెద్ద ఎత్తున సంతాపం తెలియజేయడంతో పాటు కుటుంబ సభ్యులు మనో ధైర్యంగా ఉండాలంటూ సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా జేపీ మృతికి సంతాపం తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి నేపథ్యంలో తెలుగులో ట్వీట్‌ చేసి సంతాపం తెలియజేయడం ఆసక్తికర చర్చగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ మన నటుడు జేపీ మృతికి సంతాపం తెలియజేయడం అది కూడా తెలుగులో ట్వీట్‌ చేయడం చాలా గొప్ప విషయం అంటూ తెలుగు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌ లో ప్రధాని మోడీ... జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి అంటూ ట్వీట్‌ చేశారు.
Read more!
Full View
Tags:    

Similar News