నారా హీరో @ 24/7

Update: 2015-11-17 04:55 GMT
ఆరోజుల్లో సూప‌ర్‌ స్టార్ కృష్ణ మూడు షిఫ్టుల్లో మూడు సినిమాల్లో న‌టించేవారు.. . కృష్ణ‌ - ఎన్టీఆర్‌ - ఏఎన్నార్ ఎంతో డెడికేష‌న్‌ తో సినిమాలు చేసేవారు. ఒకే ఏడాదిలో ఏడెనిమిది సినిమాల్లో న‌టించిన ట్రాక్ రికార్డ్ సూప‌ర్‌ స్టార్ కృష్ణకు ఉంది. ప‌ని ప‌ట్ల అత డెడికేష‌న్‌ తో ఉండేవారాయ‌న‌. ఆరోజుల్లో సినిమానే లోకంగా బ‌తికేవారు. కానీ మారిన ట్రెండ్‌ లో ఇప్పుడు ఆ డెడికేష‌న్‌ లోనూ మార్పొచ్చింది. ఒక సీజ‌న్‌ లో ఒకే సినిమా లో న‌టించాలి అన్న‌ట్టే ఉంది వ్య‌వ‌హారం. కానీ ఈ రూల్‌ ని కూడా బ్రేక్ చేసేస్తున్నాడు నారా రోహిత్‌.

ప్ర‌స్తుతం ఉన్న హీరోల్లో ఈ యంగ్ హీరో దూకుడు చూస్తుంటే  భ‌విష్య‌త్ సూప‌ర్‌ స్టార్ అయ్యే ల‌క్ష‌ణాలు త‌న‌కి ఉన్నాయ‌ని అంద‌రికీ అనిపిస్తోంది. రోహిత్ ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేశాడు. వీటిలో ఓ రెండు సినిమాలు ఏక‌కాలంలో తెర‌కెక్కుతున్నాయి. రాజా చెయ్యి వేస్తే డెబ్యూ డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. సావిత్రి  చిత్రం ప్రేమ ఇష్క్ కాద‌ల్ ఫేం ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఇవి రెండూ ప్ర‌స్తుతం రామోజీ ఫిలిం సిటీలో తెర‌కెక్కుతున్నాయి.

ఉద‌యం 6గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ రాజా చెయ్యి వేస్తే షూటింగ్ సాగుతోంది. ఆ త‌ర్వాత 6 పీఎం నుంచి 6 ఏఎం వ‌ర‌కూ సావిత్రి షూటింగ్‌. రోహిత్ 24/7 న‌టిస్తున్నాడు కాబ‌ట్టి అవ‌స‌రం అనుకుంటే మ‌ధ్య‌లో గంట‌, 2 గంట‌లు బ్రేక్ తీసుకుంటున్నాడ‌ని స‌మాచారం. అస‌లు రోహిత్‌ లోని ఈ డెడికేష‌న్ అత‌డిని ఓ రేంజుకి తీసుకెళుతుంద‌ని అంటున్నారంతా. ఇది యంగ్ అప్‌ క‌మ్ హీరోలంద‌రికీ ఇన్‌స్పిరేష‌న్‌.
Tags:    

Similar News