• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పట్లో ఒకడుండేవాడు.....

అప్పట్లో ఒకడుండేవాడు.. మామూలు కథ కాదు

By - Tupaki Desk
Update: 2016-04-01 03:42 GMT
యువ కథానాయకుడు నారా రోహిత్ ఎంచుకుంటున్న కథలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఓ పక్క పెద్ద పెద్ద కథానాయకులు మంచి కథ కోసం నెలలు.. సంవత్సరాలు ఎదురు చూస్తుంటే అతనేమో వైవిధ్యమైన కథలతో శరవేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. అతడి ప్రతి సినిమాలోనూ బలమైన కథ ఉంటోంది. పైగా వైవిధ్యం ఉంటోంది. గత రెండేళ్లలో రోహిత్ చేసిన ప్రతినిధి.. రౌడీఫెలో.. అసుర.. మూడూ కూడా వైవిధ్యమైన కథాబలమున్న సినిమాలే. ‘తుంటరి’ రీమేక్ కాబట్టి దాన్ని పక్కనబెట్టేసినా.. సావిత్రి-రాజా చెయ్యి వేస్తే కూడా కంటెంట్ డ్రివెన్ సినిమాలని అర్థమవుతోంది. రోహిత్ నుంచి తర్వాత రాబోయే ‘అప్పట్లో ఒకడుండేవాడు’ కథ గురించి ఆ చిత్ర దర్శకుడు సాగర్ చంద్ర చెబుతున్న విశేషాలు చూస్తుంటే.. అది కూడా రోహిత్ కెరీర్లో ఓ ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నారా రోహిత్.. శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం 1992-96 మధ్య కాలం నేపథ్యంలో సాగుతుందట. ఇందులో రోహిత్ నూరుద్దీన్ అనే ముస్లిం పాత్ర పోషిస్తుండటం విశేషం. శ్రీవిష్ణు ఓ క్రిమినల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ కథకు మహాభారతానికి కనెక్షన్ ఉందని అంటున్నాడు సాగర్ చంద్ర. ‘‘మహాభారతంలో కర్ణుడు-దుర్యోధనుడు ముందు శత్రువులుగా కనిపిస్తారు. కానీ చివరికి స్నేహితులుగా మారుతారు. ఇందులోనూ ప్రధాన పాత్రధారుల ప్రయాణం ఇలాగే సాగుతుంది. క్రికెట్.. మాఫియా.. గ్లోబలైజేషన్.. లాంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అలాగే మహాభారతం టచ్ ఉంటుంది. 90ల నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపిస్తున్నాం. తెలుగులో ఇలాంటి కథతో ఓ సినిమా తెరకెక్కలేదని కచ్చితంగా చెప్పగలను. కథలో రోహిత్.. శ్రీవిష్ణులిద్దరివి కీలక పాత్రలే. రోహిత్ పాత్ర దుర్యోధనుణ్ని పోలి ఉంటుంది. శ్రీవిష్ణు క్రికెటర్ కాబోయి.. చివరికి క్రిమినల్ గా మారిన యువకుడిగా కనిపిస్తాడు’’ అని చెప్పాడు సాగర్ చంద్ర.
Tags:    
  • Nara Rohit 
  • Appatlo Okadundevadu Movie 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS