నారా రోహిత్ మళ్లీ తిప్పాడు

Update: 2015-11-24 10:38 GMT
నిన్న ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఫొటో చూసి ఏదో సరదాకి అలా గరిట పట్టాడేమో అనుకున్నారు జనాలు. కానీ నారా రోహిత్ చాలా సీరియస్ వంటగాడేనండోయ్. వరుసగా రెండో రోజు కూడా గ్యాప్ లో నల భీముడి అవతారం ఎత్తేశాడు రోహిత్. పశ్చిమ గోదావరి జిల్లాలో తన కొత్త సినిమా ‘సావిత్రి’ షూటింగులో భాగంగా వరుసగా రెండో రోజు తన యూనిట్ సభ్యులకు వంట చేసి పెట్టాడు రోహిత్. నిన్న చేపల పులుసు వండిన ఫొటోల్ని రోహిత్ ఫేస్ బుక్ లో పెట్టిన సంగతి తెలిసిందే.

ఐతే తర్వాతి రోజు వెజ్ మీద పడ్డట్లున్నాడు.  ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సావిత్రి’ షూటింగులో భాగంగా రోహిత్ తనలోని వంట కోణాన్ని బయటికి చూపించాడు. ఈ సినిమాలో రోహిత్ సరసన నందిత హీరోయిన్ గా నటిస్తోంది. రోహిత్ తో ‘రౌడీ ఫెలో’ తీసి విమర్శకుల ప్రశంసలందుకున్న కృష్ణ చైతన్య ఈ చిత్రానికి మాటలు అందిస్తుండటం విశేషం. ‘సోలో’ తర్వాత తాను నటిస్తున్న ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని రోహిత్ చెబుతున్నాడు.
Tags:    

Similar News