మైత్రి.. నాని28 డైరెక్టర్‌ ఇతడే

Update: 2020-11-13 06:15 GMT
నిన్న నాని 28వ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. రేపు మంచి రోజంటా సినిమా కీలక ప్రకటన చేయబోతున్నాం... దర్శకుడు ఎవరు అనే విషయాన్ని అనౌన్స్‌ చేస్తాం అంటూ ప్రకటించారు. నేడు నాని 28వ సినిమా దర్శకుడి పేరును మైత్రి వారు రివీల్‌ చేశారు. వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ యువ దర్శకుడు ఇప్పటికే మెంటల్‌ మదిలో మరియు బ్రోచేవారు ఎవరురా అనే సినిమాలను చేసి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. నానికి జోడీగా ఈ సినిమాలో నజ్రియా నటించబోతుంది.

తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయిన నజ్రియా ఆమద్య కొన్నాళ్ల పాటు సినిమాల దూరంగా ఉన్న ఈమె మళ్లీ గత ఏడాది నుండి వరుసగా సినిమాలు చేస్తోంది. ఈమె నటించిన తమిళ సినిమా తెలుగులో రాజా రాణి గా డబ్‌ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో డైరెక్ట్‌ గా మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు ఉన్నాయి.

ముద్దుగా బొద్దుగా ఉండే ఈమె తెలుగు ఆడియన్స్‌ కు ఇప్పటికే నచ్చింది కనుక నానికి జోడీగా ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్‌ ను ఇదే నెల 21న ప్రకటించబోతున్నట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం నాని చేస్తున్న శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ తర్వాత ఈ కొత్త సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. టక్‌ జగదీష్‌ మరియు శ్యామ్‌ సింగరాయ్‌ తో పాటు ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే వచ్చేనా చూడాలి.
Tags:    

Similar News