లాక్ డౌన్ లోనూ ఆగని నాని సినిమా
కరోనా కారణంగా సినిమా పరిశ్రమ పూర్తిగా స్థంభించింది. షూటింగ్స్ లేక నాలుగు నెలలు అయ్యింది. చాలా సినిమాలు వాయిదా పడుతున్నాయి. కొన్ని సినిమాల మేకర్స్ ఈ ఏడాదిపై ఆశ వదిలేసుకున్నారు. ఇలాంటి సమయంలో ఒకటి రెండు సినిమాలు మాత్రం పరిస్థితులు చక్కబడ్డ వెంటనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. షూటింగ్ చేయలేని ఈ సమయంలో పోస్ట్ ప్రొడక్షన్స్ పని కానిచేస్తున్నారు. నాని సినిమాకు ఈ లాక్ డౌన్ లోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి అయ్యింది.
శివ నిర్వాన దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ చిత్రం షూటింగ్ దాదాపుగా సగం పూర్తి అయ్యింది. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో పల్లె వాతావరణంలో చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో అనుకుంటూ ఉండగా కరోనా లాక్ డౌన్ మొదలైంది. మళ్లీ ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టేది క్లారిటీ లేదు. షూటింగ్స్ కు అనుమతులు వచ్చినా కూడా కెమెరా పట్టుకుని బయట కాలు పెట్టేందుకు మేకర్స్ భయపడుతున్నారు. అందుకే ఎప్పుడైతే లాక్ డౌన్ సఢలించారో అప్పటి నుండి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యాయి.
ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి అయిన పార్ట్ కు డబ్బింగ్.. రి రికార్డింగ్.. ఎడిటింగ్ ఇలా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యాయట. పరిస్థితులు అనుకూలించిన వెంటనే షూటింగ్ కు వెళ్లడం ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్పీడ్ గా చేయడం ఆ వెంటనే సినిమాను విడుదల చేయడంపై దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఏడాది చివరి వరకు సినిమాను రెడీ చేయాలనేది ఆయన పట్టుదలగా తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ రీతూ వర్మ.. ఐశ్వర్య రాజేష్ లు నటిస్తున్నారు.