• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాని బాగానే ఉన్నాడుగా

నాని బాగానే ఉన్నాడుగా

By - Tupaki Desk
Update: 2018-02-01 11:28 GMT
నేచుర‌ల్ స్టార్ నాని కారుకు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ యాక్సిడెంట్‌లో నానీకి గాయాల‌య్యాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అస‌లు నాని ఎలా ఉన్నాడో అని అభిమానులంతా కంగారు ప‌డిపోయారు. ఆ ప్ర‌మాదం త‌రువాత తాజాగా నాని అభిమానుల ముందుకు వ‌చ్చి అనుమానాల‌న్నీ తీర్చాడు.

నానీ పూర్తిస్థాయి నిర్మాత‌గా మారి తెర‌కెక్కిన సినిమా అ. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జ‌రిగింది. ఆ ఈవెంట్‌కు నానీతో పాటూ, అనుష్క‌, నిత్య మీన‌న్ వంటి తార‌లు వ‌చ్చారు. ఆ ఈవెంట్‌లో నాని ఒంటిపై ఎక్క‌డా చిన్న క‌ట్టు కూడా క‌నిపించ‌లేదు. ఎక్క‌డా గాయాల  తాలూకు మ‌చ్చ‌లు కూడా క‌నిపించ‌లేదు. ఫుల్ జోష్ మీద మాట్లాడాడు నాని. కానీ... ఆ యాక్సిడెంట్ గురించి మాత్రం ఏమీ మాట్లాడ‌లేదు. అత‌డిని చూస్తే జ‌రిగింది చిన్న ప్ర‌మాద‌మేన‌ని అర్థ‌మైపోతుంది. కాక‌పోతే నానీ ఆ యాక్సిడెంట్ గురించి కూడా ఓ మాట అనేసి ఉంటే బాగుండేది అన్న వాద‌న‌లు వినిపిస్తాయి.

గ‌త శుక్ర‌వారం నాని కారు జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నెం 45లో అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీ కొట్టింది. ఆ స‌మ‌యంలో కారు నానీతోపాటూ అత‌ని తండ్రి రాంబాబు కూడా ఉన్నార‌ని స‌మాచారం. డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో కారు న‌డిపి యాక్సిడెంట్ కు గురైన‌ట్టు పోలీసుల‌కు చెప్పాడు. నానీ అక్క‌డే కారును వ‌దిలి మ‌రో కారులో ఇంటికి చేరుకున్నాడు.  ఆ కారు నానీ తండ్రి గంటా రాంబాబు పేరు మీద రిజిస్ట‌ర్ అయి ఉంది. ఆ ప్ర‌మాదంలో నానీ పెద‌వికి చిన్న గాయం అయ్యింది. మ‌రుస‌టి రోజే నాని ట్విట్ట‌ర్‌లో ప్ర‌మాదం పెద్ద‌దేమీ కాద‌ని - చిన్న గాయం మాత్ర‌మే అయ్యింద‌ని - అతి త్వ‌ర‌లో సినిమా షూటింగులో పాల్గొంటాన‌ని ట్వీటు చేశాడు. అయినా అభిమానుల్లో ఏదో ఆందోళ‌న‌. త‌న అభిమాన హీరోకి ఏమైందోన‌ని... ఇప్పుడు నానీని నేరుగా చూశారు క‌నుక ప్ర‌శాంతంగా ఉండి ఉంటారు.

కాగా ప్రస్తుతం నాని ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా.. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.
Tags:    
  • Nani 
  • Hero Nani 
  • TElugu NEWs 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS