నాని.. బన్నీ.. 5 కోట్లు ఎవరికి?

Update: 2018-03-20 07:58 GMT
బిగ్ బాస్.. తెలుగులో మొట్టమొదటి రియాలిటీ షోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని భాషల కంటే తక్కువ కాంట్రావర్సీలతో, ఎక్కువ టి.ఆర్.పి తో మొదటి సీజన్ పూర్తి చేసుకుంది. అది అంత పెద్ద సూపర్ హిట్ కావడానికి గల కారణాలలో ముఖ్యపాత్ర షో హోస్టుగా చేసిన మన ఎన్టీఆర్ ది అని చెప్పుకోవచ్చు. ఒకరకంగా షో ని తన భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్లిన ఘనత తారక్ దే.

అప్పటిదాకా పెద్ద తెరమీదనే కనపడిన ఎన్టీఆర్ - ప్రేక్షకులకు మరింత దగ్గరగా బుల్లి తెర మీద కనపడడం ఫాన్స్ ను సంతోషంలో ముంచెత్తింది. ఇప్పుడు స్టార్ మా ఛానల్ బిగ్ బాస్ రెండవ సీజన్ మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. కానీ ఒకవైపు త్రివిక్రమ్ సినిమాకోసం జిమ్ లో వర్కౌట్లు చేస్తూ, రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతూ బిజీగా ఉన్న నందమూరి హీరో రెండవ సీజన్ ను హోస్ట్ చేయలేను అంటూ ముందే చెప్పేసాడు. దానితో మరో హీరో కోసం వేట మొదలెట్టక తప్పలేదు.

రెండవ సీజన్ కోసం ఇప్పుడు నానీని కానీ బన్నీని కానీ తీసుకుందాం అనుకుంటున్నారు. ఈసారి షో హోస్టుగా కనిపించే హీరోకి ఇచ్చే రెమ్యూనరేషన్ అక్షరాలా అయిదు కోట్లు అంట. మొదట నానిని ఫైనలైజ్ చేశారు కానీ మళ్ళీ డిస్కషన్స్లో పడ్డారు. ఒకవేళ నాని కనుక హోస్ట్ అయితే 5 కోట్లు అతనికి పెద్ద అమౌంట్ అనే చెప్పచ్చు. చూద్దాం మరి ఆ 5 కోట్లు ఎవరు సొంతం చేసుకుంటారో..
Tags:    

Similar News