సుందరంకు ఆమెనే ఎందుకు జోడీ?

Update: 2020-11-17 07:50 GMT
నాని 28వ సినిమా ను ఇటీవలే మైత్రి మూవీ మేకర్స్‌ ప్రకటించిన విషయం తెల్సిందే. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమాకు అంటే సుందరానికి అనే టైటిల్‌ ను ఖరారు చేశారని త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ గా నజ్రియా ఫహద్‌ ను నటింపజేయడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. బొద్దుగా ముద్దుగా ఉండే ఈ అమ్మడు ఈమద్య కాలంలో బరువు తగ్గింది. తమిళం మరియు మలయాళంలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈ అమ్మడు తెలుగులో మాత్రం చేయలేదు. ఒకటి రెండు సార్లు ఈమెకు తెలుగు ఆఫర్లు వచ్చినట్లే వచ్చి చేజారాయి.

ఆమద్య గ్యాప్‌ తీసుకోవడంతో ఈమె కెరీర్‌ ముగిసినట్లే అనుకున్నారు. కాని మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యింది. తెలుగులో ఒక్క సినిమా చేయకున్నా కూడా ఈమె నటించిన తమిళ సినిమాలు రాజా రాణి నుండి మొదలుకుని పలు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దాంతో తెలుగులో ఈమెకు అభిమానులు ఉన్నారు. ఈమె తెలుగులో నటిస్తే చూడాలని చాలా మంది ఆశ పడ్డారు. దానికి తోడు సుందరంకు తోడు ఈమె అయితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మైత్రి మూవీ మేకర్స్‌ మరియు దర్శకుడు వివేక్‌ ఆమెను అనుకోవడం నాని గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందట.

సినిమాకు మరింత పాపులారిటీ రావడంతో పాటు తమిళం మరియు మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయడం కోసం ఈమె క్రేజ్‌ ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యంతో ఆమెను ఎంపిక చేసి ఉంటారు అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నాని మరియు నజ్రియాల కాంబో కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News