నాని... జై బాలయ్య అనట్లేదా?
నాని కొత్త సినిమా పేరు `జై బాలయ్య`గా ప్రచారంలో ఉంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం 2015లోనే ప్రేక్షకుల ముందుకు రావల్సింది. కానీ కొన్ని కారణాలవల్ల ఫిబ్రవరికి వాయిదా పడింది. సినిమాలో బాలకృష్ణ వీరాభిమానిగా నాని కనిపించబోతున్నాడట. ఆ పాత్ర కోసం జై బాలయ్య అనే టాటూని కూడా తన చేతిపై వేయించుకొన్నాడు నాని. అయితే ఇప్పుడు ఆ సినిమా పేరు మారినట్టు సమాచారం. కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే పేరును ఫిక్స్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఆ సినిమాలో సురభి - నివేదితా థామస్ కథానాయికలుగా నటించారు. జై బాలయ్య అనే పేరునే ఫిక్స్ చేద్దామనుకొన్నా... మరో వర్గం ప్రేక్షకులకు దూరం కావల్సి వస్తుందేమో అన్న భయంతో చిత్రబృందం ఆ నిర్ణయాన్ని మార్చుకుందట. అందుకే కాస్త లెంగ్తీనే అయినా... కృష్ణగాడి వీర ప్రేమగాథ అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలోనే పాటల్ని విడుదల చేయబోతున్నారు. ఎవడే సుబ్రమణ్యం?- భలే భలే మగాడివోయ్ చిత్రాలతో 2015లో హిట్లు కొట్టాడు నాని. అదే యేడాదిలోనే మూడో హిట్టు కూడా తన ఖాతాలో వేసుకోవాలనుకొన్నాడు. కానీ కుదర్లేదు. జనవరిలో విడుదల చేద్దామనుకొన్నారు కానీ.. సంక్రాంతి సినిమాల జోరు ఎక్కువగా ఉంది. అందుకే ఫిబ్రవరి 4న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.