• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'శ్యామ్ సింగ రాయ్'...

'శ్యామ్ సింగ రాయ్' విషయంలో క్లారిటీ ఇచ్చిన నాని!

By - Tupaki Desk
Update: 2021-12-17 11:32 GMT
నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'శ్యామ్ సింగ రాయ్' రెడీ అవుతున్నాడు. దర్శకుడిగా రాహుల్ సాంకృత్యన్ కి ఇది రెండవ సినిమా. ఈ సినిమాతోనే వెంకట్ బోయనపల్లి నిర్మాతగా పరిచయమవుతున్నాడు. 'శ్యామ్ సింగ రాయ్' అనే టైటిల్ ను ఎనౌన్స్ చేసినప్పుడు, ఈ సినిమాలో నాని మూడు పాత్రలు చేస్తున్నట్టుగా చెప్పుకున్నారు.

కానీ ఈ సినిమాలో నాని రెండు పాత్రలు మాత్రమే చేస్తున్నట్టుగా మేకర్స్ చెప్పారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండు ప్రకారం ఇద్దరి పేర్లను కలిపి ఇలా టైటిల్ ను సెట్ చేసి ఉంటారని అంతా అనుకున్నారు.

కానీ సినిమాలో నాని పోషించిన మరో పాత్ర పేరు 'వాసు' అనే విషయం మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అంటే 'శ్యామ్ సింగ రాయ్' అనేది ఒక పాత్ర పేరే అనే విషయం స్పష్టమైపోయింది.

ఈ పాత్ర 70 దశకంలో కథ జరుగుతున్నప్పుడు కనిపిస్తుంది. ఈ పాత్రలోనే నాని డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ పాత్ర సరసన హీరోయిన్ గా సాయిపల్లవి కనిపించనుంది. ఇద్దరి జోడీ బాగుందనే విషయం ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్లు చూడటంతోనే అర్థమైపోయింది. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీని మరోసారి చూడటానికి అభిమానులంతా ఆసక్తితో ఉన్నారు.

ఇక వాసు అనే పాత్ర ప్రస్తుతం జరిగే కథలో కనిపిస్తుంది. ఈ పాత్ర జోడీగా కృతి శెట్టి అలరించనుంది. ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ను ఒక రేంజ్ లో నడిపించినట్టు అప్ డేట్స్ ను బట్టి అర్థమవుతోంది. వాసు పాత్రలో నాని చాలా స్లిమ్ గా కనిపిస్తున్నాడనీ, 'శ్యామ్ సింగ రాయ్' పాత్ర కోసం ఆయన బరువు పెరిగాడని చెప్పుకున్నారు.

తాజా ఇంటర్వ్యూలో నానికి ఇదే ప్రశ్న ఎదురైంది కూడా. అందుకు ఆయన స్పందిస్తూ .. తాను బరువు పెరగలేదనీ .. అసలు అలాంటి ప్రయత్నమే చేయలేదని చెప్పాడు. గెడ్డం తీయడం వలన అలా కనిపించి ఉండొచ్చని అన్నాడు.

ఇంతవరకూ కొత్తగా తాను ఏది ట్రై చేసినా అభిమానులు ప్రోత్సహిస్తూ వచ్చారనీ, అలాగే ఈ సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉందని నాని అన్నాడు. ఆ నమ్మకం తోనే ఈ కథను ఒప్పుకోవడం జరిగిందని చెప్పాడు. ఇక తన అభిమాన దర్శకుడు మణిరత్నం అనీ, గతంలో ఆయనతో ఒక సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికే కుదరలేదని చెప్పాడు.

ఈ సారి ఆయన సినిమాలో అవకాశం వస్తే ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోనని అన్నాడు. ఆయన సినిమాలో చేయాలనేదే తన డ్రీమ్ అని చెప్పాడు. మరి నాని ఆశించినట్టుగా ఆయనకి మణిరత్నం సినిమాలో ఛాన్స్ వస్తుందేమో చూడాలి.


Tags:    
  • Nani 
  • Shyam Singa Roy 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS