ఆ పాత ఫ్లాపు సినిమాయే గుర్తొస్తోంది

Update: 2015-05-26 11:30 GMT
కొత్తగా హిట్టు కొడతాం.. 8 పేజీల డైలాగ్‌ సింగిల్‌ టేక్‌లో.. కొత్త ఎనర్జీ.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌.. ''భలే భలే మగాడివోయ్‌''.. ఇవన్నీ వినడానికి బాగానే ఉన్నాయి. ఒక హీరో సింగిల్‌ టేక్‌లో చాలా పేజీల డైలాగులు చెప్పేస్తే సినిమా హిట్టవ్వదు. ఆ లెక్కకొస్తే అట్టర్‌ ఫ్లాపు మూవీస్‌లో నాన్‌స్టాప్‌ ఎన్టీఆర్‌ వన్‌మినిట్‌ డ్యాన్స్‌ స్టెప్పులు వేశాడు. అలా రికార్డ్‌ వర్క్‌ వలన సినిమాలు ఆడవనడానికి అదో ప్రూఫ్‌. ఇక మ్యాటర్‌లోకి వెళిపోదాం..

నిజానికి భలే భలే మగాడివోయ్‌ అనగానే ఆడియన్స్‌ టైటిల్‌ లుక్‌ నుండి సినిమా లుక్‌ వరకు కాస్త కొత్తగా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. అందులోనూ టైటిల్‌లో మగాడు అని ఉండటంతో మనోళ్ళు హీరోయిజమ్‌ను ఊహించేశారు. కట్‌ చేస్తే.. మారుతి మాత్రం ఒక రొమాంటిక్‌ మూవీ పోస్టర్‌ను రిలీజ్‌ చేశాడు. అంతేకాదు, ఆ పోస్టర్‌ కూడా నాని బాబు గతంలో చేసి ఫ్లాప్‌ మూవీ ''ఎటో వెళ్ళిపోయింది మనస్సు'' సినిమా పోస్టర్‌ టైపులోనే ఉంది. ఏ హీరో హీరోయిన్‌ అయినా కూడా ఇంతకంటే ఎలా కూర్చుంటారు అని రొమాన్స్‌ లవర్స్‌ అనుకోవచ్చు, కాని తన పాత సినిమాల పోస్టర్లకే దగ్గరగా ఉంటే చూసేవారికి ఏం బాగుంటుంది చెప్పండి?

Tags:    

Similar News