నంది అవార్డు విశేషాలివే.. ఎప్పుడు మొదలు పెట్టారంటే..!

Update: 2023-05-05 09:57 GMT
పరిశ్రమ ఏదైనా తమకు వచ్చే జీతం కన్నా ప్రశంస అనేది చాలా ఎంక్రేజ్ మెంట్ ఇస్తుంది. ఇక అవార్డు లాంటివి వస్తే ఆ ఉత్సాహం వేరేలా ఉంటుంది. సినీ పరిశ్రమకు సంబంధించి నంది అవార్డులు ప్రభుత్వం అధికారికంగా ఇస్తుంది.

తెలుగు పరిశ్రమకు నంది అవార్డు అనేది చాలా ప్రతిష్టాత్మక అవార్డు గా పేరుంది. కానీ ఈమధ్య ప్రభుత్వాలు నంది అవార్డులను పట్టించుకోవడం మానేశారు. 2017 లో అంతకుముందు మూడు సంవత్సరాలు అనగా 2014, 2015, 2016 సంవత్సరాలకు గాను నంది అవార్డు ఇచ్చింది.

మళ్లీ అప్పటి నుంచి నంది అవార్డుల ఊసే ఎత్తలేదు. ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డు తెలుగు వారికి జాతీయ అవార్డు లానే భావిస్తారు. అసలు నంది అవార్డుల ప్రదానం ఎప్పుడు మొదలైంది అన్నది చూస్తే.. 1964లో నంది అవార్డులను ఇవ్వడం మొదలు పెట్టారు. అంటే 50 ఏళ్లుగా ఈ అవార్డుల వేడుక కొనసాగుతూ వచ్చింది.

1964లో కేవలం ఒక్క కేటగిరికి మాత్రమే నంది అవార్డు ప్రకటించారు. మొదటిసారి డాక్టర్ చక్రవర్తి సినిమాకు ఉత్తమ చిత్రం గా నంది అవార్డు లభించింది. 1977లొ కేవలం ఉత్తమ చిత్రం కు మాత్రమే కాకుండా నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు పురస్కారం అందించడం మొదలు పెట్టారు. టాలీవుడ్ లో అత్యధిక నంది అవార్డు పొందిన హీరో కింగ్ నాగార్జున. ఆయన నటుడిగా నిర్మాతగా మొత్తం 9 అవార్డులను పొందారు.

ఇక ఆ తర్వాత స్థానంలో మహేష్ బాబు 8 నంది అవార్డులు అందుకున్నారు. ఇక ఆ తర్వాత వెంకటేష్, జగపతి బాబు 7 సార్లు నంది అవార్డుని దక్కించుకోగా.. కమల్ హాసన్ చిరంజీవి బాలకృష్ణ 3 సార్లు నంది అవార్డు అందుకున్నారు.

2016లో ఎన్.టి.ఆర్ బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డుని అందుకున్నారు. ఇక ఉత్తమ గేయ రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డులను కొనసాగించాలని అనుకుంది కానీ కుదరలేదు. 2017లో చివరిగా నంది అవార్డుల ప్రదానం జరిగింది. ఇక తెలంగాణాలో నంది అవార్డుల స్థానంలో సింహా అవార్డులను ఇవ్వాలని ప్రతిపాదన ఉంది.

Similar News