• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి హీరో ఆశలన్నీ ఆ...

నందమూరి హీరో ఆశలన్నీ ఆ సినిమాపైనే..!

By - Tupaki Desk
Update: 2021-11-16 11:10 GMT
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడో తరం హీరో కళ్యాణ్ రామ్.. నిర్మాతగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే హీరోగా 'పటాస్' తరువాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయారు. ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకోవాలని గట్టిగా ట్రై చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు నాలుగు విభిన్నమైన కథా చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ''బింబిసార'' సినిమా కూడా ఉంది.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ స్వీయ నిర్మాణంలో 'బింబిసార' సినిమా రూపొందుతోంది. ఇది చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ అండ్ టైం ట్రావెల్ మూవీ. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. చెడు నుంచి మంచి వైపు సాగిన టైం ట్రావెల్ మూవీ ఇదని.. బార్బేరియన్ కింగ్ బింబిసార కథ అని చిత్ర బృందం పేర్కొంది. డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బింబిసార' సినిమాని అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీగా ఖర్చు చేసి రూపొందిస్తున్నారు. ఇది కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌ లోనే భారీ బడ్జెట్‌ సినిమా. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా పలు భారతీయ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన కేథరీన్‌ ట్రెసా - సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

'బింబిసార' సినిమాపై కళ్యాణ్ రామ్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అయితే తదుపరి మూడు సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారు. ఇకపోతే కల్యాణ్‌ రామ్‌ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో ఓ మూవీ చేయనున్నారు. నవీన్ ఎర్నేని - వై. రవిశంకర్ నిర్మించే ఈ చిత్రానికి రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. అలానే దిల్ రాజు బ్యానర్ లో కేవీ గుహన్ డైరెక్షన్ లో ఓ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ని ప్లాన్ చేశారు.

ఇదే క్రమంలో నవీన్ మేడారం అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. 'డెవిల్' అనే మూవీని ప్రకటించారు కళ్యాణ్ రామ్. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈస్ట్‌ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ లో కూడా ఓ సినిమా చేయడానికి నందమూరి హీరో అంగీకరించారు. అయితే ఇటీవల నిర్మాత మహేష్ కోనేరు ఆకస్మిక మృతి చెందడంతో ఈ సినిమా ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Tags:    
  • Bimbisara 
  • Nandamuri Kalyan Ram 
  • Nandamuri arts 
  • Nandamuri Kalyan Ram movies 
  • pataas 

Similar News

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS