ఫోటో స్టొరీ: తండ్రీకొడుకులుగా బాబాయ్ అబ్బాయిలు

Update: 2018-10-18 10:48 GMT
నందమూరి బాలకృష్ణ - క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' ఇప్పటికే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా దసరా సందర్భంగా మరో స్టన్నింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది 'ఎన్టీఆర్' టీమ్.  ఎన్టీఆర్ - హరికృష్ణ లు కలిసి ఉన్న పోస్టర్ అది.

ఈ సినిమాలో నందమూరి హరికృష్ణ పాత్రలో అయన కుమారుడు నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.  పోస్టర్లో ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య అచ్చతెలుగు పంచ కట్టులో తెలుగు రంగు చొక్కా - ధోవతి - కండువా ధరించి కుర్చిలో కూర్చున్నాడు.  కళ్యాణ్ రామ్ మాత్రం హరికృష్ణగారి లాగానే అప్పటి స్టైల్ డ్రెస్ లో కర్లీ హెయిర్ తో కనిపించాడు. నాన్నగారికి విధేయతతో ముందుకు వంగి ఏదో చెబుతున్నట్టుగా ఉన్నాడు.  ఇద్దరూ ఎన్టీఆర్ - హరికృష్ణ లను మక్కికి మక్కి దించేయడం మాత్రం హైలైట్.

బాబాయ్ బాలయ్య తో కలిసి కళ్యాణ్ రామ్ నటించడం ఇది రెండో సారి.  మొదటి సారి బాలకృష్ణ 'బాలగోపాలుడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కళ్యాణ్ రామ్ నటించాడు.  అది కళ్యాణ్ రామ్ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ.  ఇప్పుడు మరో సారి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించడం.. అందులోనూ తండ్రిగారి పాత్ర పోషించడం ఖచ్చితంగా ఒక గొప్ప అనుభవం అనిమాత్రం చెప్పవచ్చు.  నందమూరి అభిమానులకు ఈ పోస్టర్ వండర్ఫుల్ దసరా గిఫ్టే.
Tags:    

Similar News