• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందమూరి కాంపౌండ్ వీక్...

నందమూరి కాంపౌండ్ వీక్ అయిపోయిందే

By - Tupaki Desk
Update: 2020-01-29 05:18 GMT
తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖ సినిమా కుటుంబాల్లో నందమూరి ఫ్యామిలీ ఒకటి. ఇప్పుడు నందమూరి కుటుంబంలో మూడవ తరం కొనసాగుతోందంటేనే మనం నందమూరి ఫ్యామిలీ లెగసీని అర్థం చేసుకోవచ్చు.  లెజెండరీ ఎన్టీఆర్ తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఒక స్టార్ హీరోగానే కాకుండా నిర్మాతగా.. దర్శకుడిగా అయన ఘన విజయాలు సాధించారు.  బహుముఖ ప్రజ్ఞను కనబరిచారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించారు.

ఎన్టీఆర్ కు వారసుడిగా రంగప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ మునుపటి తరంలో స్టార్ హీరోగా తన సత్తా చాటారు. భారీ మాస్ ఫాలోయింగ్ తో తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్నారు. సినిమాల్లో బాలయ్య టచ్ చెయ్యని జోనర్ దాదాపుగా లేదు. అయితే బాలయ్యకు ఈమధ్య విజయాలు లభించడం లేదు. ఈ తరం ప్రేక్షకులను మెప్పించగలిగే సినిమాలు చేయలేకపోతున్నారు. వరస ఫెయిల్యూర్లతో సతమతమవుతున్నారు.  బాలయ్య కెరీర్ చివరి దశకు వచ్చిందనే వాదన కూడా వినిపిస్తోంది. వయసు కూడా మీద పడుతూ ఉండడంతో ఎక్కువ కాలం హీరోగా కొనసాగడం కష్టమేనని అంటున్నారు.  నిర్మాతగా చూస్తే మాత్రం బాలయ్యకు కలిసిరాలేదు.

ఈ తరం నందమూరి వారసుల విషయం తీసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరిగా తన సత్తా చాటుతున్నారు. నందమూరి కుటుంబం లెగసీని ముందుకు తీసుకుపోగల స్థాయి తారక్ కు ఉందనేది అందరూ అంగీకరించే విషయం.  అయితే తారక్ తప్ప ఈ జెనరేషన్లో మరో సక్సెస్ ఫుల్ హీరో నందమూరి ఫ్యామిలీలో లేరు.  తారక్ అన్నయ్య కళ్యాణ్ రామ్ హీరోగా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆయనకు పెద్దగా విజయాలు లభించడం లేదు. ఆయన కెరీర్ పయనం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరోల స్థాయిని దాటలేకుండా ఉన్నారు. ఎక్కువకాలం కళ్యాణ్ రామ్ హీరోగా కొనసాగే పరిస్థితి లేదని.. రెండేళ్లలో నిర్మాతగా స్థిరపడవచ్చని కూడా ఒక టాక్ ఉంది.

ఇక నందమూరి కుటుంబంలో ఇతర హీరోల గురించి మాట్లాడుకుంటే తారకరత్నకు విజయాలు దక్కకపోవడంతో ఇప్పుడు అవకాశాలు లేవు.  ఇక నందమూరి కుటుంబానికి బంధువులు అయిన నారా రోహిత్ విభిన్న కథాంశాలతో ఈ తరం ప్రేక్షకులను మెప్పించినా.. ఈమధ్య పూర్తిగా ఫేడ్ అవుట్ అయ్యారు. 

ఒకవైపు మెగా ఫ్యామిలీలో మాత్రం అటు హీరోలు.. ఇటు నిర్మాతల హవా జోరుగా ఉంది.  దాదాపుగా మెగా ఫ్యామిలీ వారు ఇండస్ట్రీని శాసిస్తున్నారు. కానీ నందమూరి కుటుంబానికి వచ్చేసరికి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్ట్రాంగ్ గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ తప్ప మిగతా అంతా నీరసంగా ఉందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన వాస్తవం.  ప్రముఖ సినీ కుటుంబంలో హీరోలు ఇలా ఉండడం అభిమానులకు నిరాశ కలిగించే అంశమే.
Tags:    
  • Nandamuri Family Hereoes 
  • Telugu FIlm Industry 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS