• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'అఖండ'లో ఖర్చు కాదు .. కథ...

'అఖండ'లో ఖర్చు కాదు .. కథ కనిపిస్తుంది: బాలకృష్ణ

By - Tupaki Desk
Update: 2022-03-13 02:34 GMT
బాలకృష్ణ హీరోగా వచ్చిన భారీ చిత్రాలలో .. సంచలన విజయాలను సాధించిన చిత్రాల జాబితాలో 'అఖండ' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమా 100 రోజుల పండుగను 'కర్నూల్' లో నిర్వహించగా, ఈ వేదికపై బాలకృష్ణ తనదైన స్టైల్లో మాట్లాడారు. "ఒక సినిమా జనం మధ్యలో 'శతదినోత్సవ వేడుక'ను జరువుకుని ఎన్ని సమత్సరాలు అయిందో. నిర్మాణ సమయంలో ఈ సినిమా కరోనా కారణంగా ఎన్నో ఆటంకాలను .. అవరోధాలను ఎదుర్కొంది. అలాంటి ఈ సినిమా విడుదలైన తరువాత 100 రోజులు ఆడేసింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో హైందవ ధర్మాన్ని మరోసారి నిలబెట్టిన సినిమా 'అఖండ' అని చెప్పుకోవాలి. ధర్మానికి హాని కలిగించినప్పుడు భగవంతుడు తన సహాయకుడి ద్వారా మళ్లీ సక్రమమైన మార్గంలో నడిపిస్తాడని చాటి చెప్పిన సినిమా ఇది. మమ్మల్ని పరికరాలుగా చేసుకుని మా ద్వారా ఒక చక్కని సందేశాన్ని ఇప్పించిన భగవంతుడికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను బోయపాటి ఎప్పుడూ కూడా ఖర్చును దృష్టిలో పెట్టుకోము. కథను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళతాము.

మా ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి మంచి అవగాహన ఉంది. మూడే ముక్కల్లో కథను అనుకుంటాము .. దానిని అద్భుతంగా తయారు చేస్తాము. 'సింహా' .. 'లెజెండ్' .. 'అఖండ' సినిమాలు అలాగే పుట్టుకొచ్చాయి. పాత్రలను అద్భుతంగా మలచగల సత్తా ఉన్న దర్శకుడు మన బోయపాటి గారు. మేము ఇద్దరం కలిసి చేస్తున్న సినిమాలను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికే ఇంత దూరం వచ్చాము. మా సినిమా కర్నూల్ లోని మూడు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

ఇక్క అభిమానులు మాత్రమే కాదు .. అందరూ చూడటం వలన .. ఆదరించడం వలన ఈ సినిమా ఇంతటి ఘనవిజయాన్ని అందుకుంది. ఒక్క తెలుగువారు మాత్రమే కాదు .. భారతదేశమంతా గర్వంతో తల ఎత్తుకునేలా చేసింది ఈ అఖండ చిత్రం. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకోవలసిన బాధ్యత మాపై ఉంది. నా సినిమాలనే నాకు పోటీగా భావిస్తాను. నటన అంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం .. ఆ పాత్రలో జీవించడం. అందుకు కారణమైన దర్శకుడికి .. రచయితలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

తమన్ ఎంతో మంచి పాటలను అందించాడు. ప్రేక్షకులను ఆయన మరో ప్రపంచంలోకి తీసుకుని వెళ్లాడు.  శ్రీకాంత్ .. జగపతిబాబు .. నితిన్ మెహతా .. ప్రగ్యా .. పూర్ణ అంతా కూడా ఈ సినిమాలో ఎంతో బాగా నటించారు. కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను చేశాము. బయట కరోనా అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని మరిచిపోయి పనిచేశాము. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ .. ఆదరించిన ప్రతి ఒక్కరికీ ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.
Tags:    
  • Balakrishna 
  • Akhanda Kruthagnatha Sabha 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS