తనూశ్రీ ఫొటోలు కాల్చిన మహిళ రైతులు

Update: 2018-10-07 11:22 GMT
బాలీవుడ్‌ ను గత కొన్ని రోజులుగా కుదిపేస్తున్న తనూశ్రీ వివాదంలో ప్రతి రోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. తనూశ్రీ వివాదంలో స్టింగ్‌ ఆపరేషన్‌ కు సంబంధించిన టేపులు లీక్‌ అవ్వడం - పోలీసుల కంప్లైంట్స్‌ - లీగల్‌ నోటీసులు ఇలా వరుసగా ఏదో ఒక విషయం మీడియాలో హల్‌ చల్‌ చేస్తూనే ఉంది. దాంతో తనూశ్రీ విషయం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. నటుడు నానా పటేకర్‌ పై తనూశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై తాజాగా మహారాష్ట్ర మహిళలు మరియు రైతుల భార్యలు స్పందించారు.

మహారాష్ట్ర రైతుల పక్షాన నిల్చుని పోరాటం చేసి, ఎంతో మంది ఆత్మహత్యలను అడ్డుకున్న నానా పటేకర్‌ పై నీచమైన లైంగిక వేదింపుల ఆరోపణలు చేయడంతో పాటు, ఆయన ప్రవర్తనపై కామెంట్స్‌ చేయడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. నానా పటేకర్‌ పై విమర్శలకు నిరసనగా తాజాగా మహిళలు తనూశ్రీ దత్తా ఫొటోలను రోడ్డు మీద తగులబెట్టారు. నానా వ్యక్తిత్వం గురించి, ఆయన మంచి తనం గురించి మా అందరికి తెలుసని, ఆయన ఎప్పుడు కూడా తప్పుడు మనిషి కాడు అంటూ మహిళలు నానాకు మద్దతు తెలిపారు.

మా అందరికి కూడా నానా తండ్రితో సమానమైన వ్యక్తి అని, తండ్రిని ఒక వ్యక్తి తన పబ్లిసిటీ కోసం ఇలా రోడ్డుకు ఇడ్చితే తాము భరించలేక పోతున్నామంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు తనుశ్రీ దత్తాకు మద్దతు కూడా పెరుగుతూ వస్తోంది. ఈ వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు బాలీవుడ్‌ ప్రముఖ మేకర్స్‌ రంగంలోకి దిగుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

Tags:    

Similar News