• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘నక్షత్రం’ మళ్లీ వాయిదా

‘నక్షత్రం’ మళ్లీ వాయిదా

By - Tupaki Desk
Update: 2017-07-21 06:56 GMT
ఏడాదిన్నర కిందట మొదలైన సినిమా ‘నక్షత్రం’. గత ఏడాదే పూర్తయి విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. పలుమార్లు విడుదల గురించి ప్రకటనలు ఇచ్చారు. చివరికి ఈ నెల 28న సినిమాను విడుదల చేస్తున్నట్లుగా ఇటీవలే అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలారు. కానీ ఈ తేదీకి కూడా ఆ సినిమా విడుదల కావల్లేదు. ఈ చిత్రాన్ని వారం ఆలస్యంగా ఆగస్టు 4న రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటన వచ్చింది. ఈ నెల 28న ‘గౌతమ్ నంద’ మంచి అంచనాల మధ్య రిలీజవుతున్న నేపథ్యంలో.. ఆగస్టు 4కు వెళ్లినట్లు తెలుస్తోంది.

రానా సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ని ఆగస్టు 4 నుంచి 11కు వాయిదా వేసిన నేపథ్యంలో ఆ తేదీ మంచిదని భావించినట్లుంది. అదే రోజు సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ‘దర్శకుడు’ కూడా విడుదలవుతుంది. 28 నుంచి ‘నక్షత్రం’ వెళ్లిపోయిన నేపథ్యంలో ‘గౌతమ్ నంద’కు లైన్ క్లియరైనట్లే. అదే తేదీన రావాల్సిన తమిళ డబ్బింగ్ సినిమా ‘వీఐపీ-2’ కూడా వాయిదా పడటంతో ‘గౌతమ్ నంద’ సోలోగా థియేటర్లలోకి దిగబోతోంది. గోపీచంద్ కు ప్రస్తుతం హిట్టు చాలా అవసరం. ఈ సినిమాపై పెట్టుబడి కూడా ఎక్కువే పెట్టారు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కావాల్సిందే. భగవాన్.. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించాడు. హన్సిక మొత్వాని.. కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటించారు.
Tags:    
  • Krishna Vamsi 
  • Nakshatram Movie 
  • Nakshatram Release Date 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS