• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నక్షత్రం మెరవడానికి కొత్త...

నక్షత్రం మెరవడానికి కొత్త తేదీ

By - Tupaki Desk
Update: 2017-07-22 12:00 GMT
ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ గా తీసిన గోవిందుడు అందరి వాడేలే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ కొద్దికాలంపాటు విరామం తీసుకున్నారు. గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం సినిమా మొదలెట్టారు. ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేశాడనే విషయం అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాకు బజ్ స్టార్ట్ అయింది. దీనికితోడు ఖడ్గం తర్వాత కృష్ణ వంశీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టెయినర్ తీయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులే అయినా థియేటర్లకు రాలేదు. మిణుకుమిణుకు మంటూ మెరవాల్సిన నక్షత్రం మెరవకుండా పోయిందేమిటా అని డౌట్లు వస్తున్న వేళ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోందంటూ ట్రయిలర్ వదిలారు. అడ్డుగోడలన్నీ దాటి ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేశారు. ఆగస్టు 4న ఈ సినిమా థియేటర్లకు రానుంది. హనుమంతుడు పోలీస్ ఆఫీసర్ డ్యూటీలో కనిపిస్తే ఎలా ఉంటుందో తెలిపేలా ఈ సినిమాలో చూపించానంటూ డైరెక్టర్ కృష్ణవంశీ చెప్పాడు. యంగ్ హీరో తనీష్ తొలిసారి విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు.

నక్షత్రం సినిమా ట్రయిలర్ చూసినప్పుడు కంటెంట్ కన్నా కేకలే ఎక్కువగా వినిపించాయి. డైలాగులు పాటలు హీరోయిన్ల గ్లామర్ చూసినప్పుడు మాత్రం కృష్ణవంశీ మార్కు క్లియర్ గా కనిపించింది. చాలాకాలంగా తెలుగులో హిట్ కోసం చూస్తున్న రెజీనా కెసాండ్రా ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్లు గా నటించి ధారాళంగా గ్లామర్ ఆరబోశారు. నక్షత్రం పోస్టు ప్రొడక్షన్ - సెన్సార్ పనులు పూర్తయ్యాయి. రిలీజయ్యాక థియేటర్లలో ఎంతవరకు మెరుస్తుందో చూడాలి.
Tags:    
  • Krishna Vamsi 
  • Nakshatram Movie 
  • Nakshatram Release Date 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS