నాగశౌర్య కథానాయకుడిగా 'వరుడు కావలెను' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, లక్ష్మీసౌజన్య దర్శకత్వం వహించారు. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన బాణీలు జనంలోకి దూసుకుపోయాయి. పాటలన్నీ కూడా చాలా బాగున్నాయనే టాక్ వినిపిస్తోంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. రానా ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేదికపై నాగశౌర్య మాట్లాడాడు.
"ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి రానా రావడం వలన ఒక అందం వచ్చేసింది .. ఈ సినిమా ఒక ఎత్తులోకి వెళ్లిపోయింది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. సితార బ్యానర్ నుంచి ఈ సినిమా వస్తోంది. నిర్మాతలు చినబాబు గారు - నాగవంశీ గారు ఈ హీరోకి ఇంత బడ్జెట్ అని చూసేవారు కాదు. ఈ కథకు ఎంత పెట్టాలి అనే ఆలోచించే వారినే మేకర్స్ అంటారు. అలాంటి మేకర్స్ లో వారిద్దరూ కనిపిస్తారు. ఈ సినిమాకు గణేశ్ రావూరి గారు రాసిన మాటలు చాలా బాగున్నాయి.
గణేశ్ రావూరి గారు వచ్చి కథ చెప్పినప్పుడు .. పక్కా హిట్ సార్ అని చెప్పాను. ఇక దీనిని మీరు ఎంతకష్టపడి చెడగొడదామన్నా ఇది చెరగదు. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ పేపర్ పై హిట్ అయిపోయింది .. నాకు కనిపిస్తోంది అని చెప్పాను. అనుకున్నట్టుగానే చాలా బాగా వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ గారు అందించిన సంగీతం చాలా బాగా వచ్చింది. ఇక సినిమాటో గ్రఫర్ వంశీ పచ్చిపులుసు గురించి చెప్పాలి. తెరపై నేను ఇంత అందంగా కనిపించడానికి కారణం ఆయనే. నను చూసుకుని నేనే లవ్ లో పడేంత అందంగా చూపించారు.
ఇక లక్ష్మీ సౌజన్యగారి విషయానికి వస్తే 'ఛలో' సినిమా సక్సెస్ మీట్లో నన్ను కలిసింది. "తమ్ముడూ నీకో కథ చెబుతాను వింటావా అంది. చెప్పక్కా అన్నాను .. చెప్పింది .. చేస్తాను అన్నాను. ఆ కథకి సితార బ్యానర్ యాడ్ కావడంతో ఎక్కడికి వెళ్లిపోయింది. ఈ సినిమా అక్క అనుకున్నట్టుగానే బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రతి చిన్న విషయంలో ఆమె శ్రద్ధ తీసుకునేది. షర్ట్ కొంచెం నలిగినా కారవాన్ కి పంపించి ఐరన్ చేయించి తీసుకుని వచ్చేవరకూ నన్ను అక్కడే నిలబెట్టేది. అంత నీట్ గా నన్ను చూపించింది.
ఇక వరుడు కావాలి .. వరుడు కావాలి అంటున్నారు .. ఎవరికి కావాలి? అమ్మాయికి కదా కావాలి .. ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదు. రీతూ వర్మ చాలా బాగా చేసింది .. తను చాలా ప్రొఫెషనల్. ఆమెతో నటించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ ఫంక్షన్ కి తను వస్తుంది. మా ఇద్దరికీ ఏదో గొడవైంది .. అందుకే తను రాలేదని మీరు అనుకుంటారని చెబుతున్నాను. అలాంటిదేం లేదు .. తను షూటింగులో ఉంది. కోవిడ్ కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే సినిమాను చూడండి .. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. 'ఇక ఈ సినిమాకి .. ఇంతకు ముందు వచ్చిన ఆయన సినిమాలకి డిఫరెన్స్ ఏంటి?' అంటూ అభిమానులు అడిగిన ప్రశ్నకి నాగశౌర్య స్పందిస్తూ, ఇంతకి ముందు సినిమాకి .. ఈ సినిమాకి 16 కేజీల బరువు తగ్గాననీ .. అదే పెద్ద డిఫరెన్స్ అని చెప్పుకొచ్చాడు.