ఏంటి నాని చేసేద్దామా? అంటున్న నాగ్

Update: 2018-09-21 05:05 GMT
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'దేవదాస్' సెప్టెంబర్ 27 న విడుదలకు సిద్ధం అవుతుంది.  రిలీజ్ కు మరో వారం మాత్రమే ఉండడంతో 'దేవదాస్' టీమ్ నిన్న రాత్రి ఆడియో ఫంక్షన్ జరిపారు.  ఫుల్ ఆల్బమ్ ను రిలీజ్ చేయడం తో పాటుగా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.  ఇక ఈ ఈవెంట్ లో నాగార్జున ఇంట్రెస్టింగ్ స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. నాని పై ప్రశంసల వర్షం కురిపించాడు. పనిలో పనిగా నాని ని కూడా మరో సినిమాకు లాక్ చేశాడు.  

"అదేంటో నేను ఏదైనా మనసులో అనుకునున్నవి జరుగుతూ ఉంటాయి.  చాలా గట్టిగా అనుకున్నవి మరీ గట్టిగా జరుగుతాయి. మల్టిస్టారర్ చేస్తే నాని తో చేయాలని ఎప్పటినుంచో అనుకుకుంటూ ఉన్నాను(నాగ్ మాట్లాడుతున్నంతసేపు నాని ముసి ముసి నవ్వులే!)..ఎందుకంటే  దేర్ ఈజ్ సంథింగ్ నైస్ అబౌట్ యు.  స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు నాని ని కాపాడాలనిపిస్తుంది.  ఈ సినిమాలో కూడా అటువంటి రోలే ఇచ్చారు..  యువర్ డైలాగ్ డెలివరీ ఈజ్ సో బ్యూటీఫుల్.. డైలాగ్స్ అలా స్మూత్ గా వచ్చేస్తాయి. ఎదో పాట విన్నట్టు.. నీకు చక్కటి వాయిస్ ఉంది.  నాని తో చేస్తే బాగుంటుందని అనుకున్నాను.. ఈ సినిమాలో చేశాను.  నాని.. థ్యాంక్ యు ఫర్ బీయింగ్ మై కొ స్టార్.  నీతో పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేశాను. యూ ఆర్ ఎ వండర్ఫుల్ కో స్టార్. ఏంటి నాని దీనికి సీక్వెల్ చేద్దామా?... చేద్దాం!"

నాగార్జున లాంటి సీనియర్ స్టార్ నుండి ఈ రేంజ్ లో అభిమానం పొందడం అనేది నాని లాంటి ఈ జెనరేషన్ స్టార్ కు దీవెనల లాంటివే.  ఎంతో టాలెంట్ ఉంటే తప్ప నాగార్జున అలా స్టేజ్ మీదే మరో సారి కలిసి పనిచేద్దామా అని అడగడు. ఇక మీరు కూడా ఫిక్స్ అయిపోండి  'దేవదాస్ 2.0' సినిమాకు..!
Tags:    

Similar News