• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ అభిమానుల్లో ఆ భయం

నాగ్ అభిమానుల్లో ఆ భయం

By - Tupaki Desk
Update: 2019-12-28 07:25 GMT
అక్కినేని నాగార్జున కెరీర్ ఎన్నడూ లేనంత స్లంప్‌ లో ఉందిప్పుడు. ఈ ఏడాది ఆయన్నుంచి వచ్చిన ‘మన్మథుడు-2’ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. అయితే ఈ ఫలితాన్ని పట్టించుకోకుండా నాగ్ చడీచప్పుడు లేకుండా మరో ప్రయోగాత్మక సినిమా చేయడానికి రెడీ అయి పోయాడు. ‘మహర్షి’ సినిమాకు రచయితగా పని చేసిన సాల్మన్‌ను దర్శకుడి గా పరిచయం చేస్తూ ‘వైల్డ్ డాగ్’ అనే సినిమాను ఆల్రెడీ పట్టాలెక్కించేశాడు నాగ్. ఇందులో నాగ్ ఎన్‌కౌంటర్  స్పెషలిస్ట్ విజయ్ వర్మ గా కనిపించనున్నాడు. నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలో పని చేసే పోలీస్ అధికారి పాత్ర ఇది. అసలు ఈ సినిమా ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. అప్పుడు ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసేశారు. ఆ షెడ్యూల్‌‌ లోని సన్నివేశాల నుంచే ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసేశారు.


ఈ ఫస్ట్ లుక్, సినిమా కాన్సెప్ట్ ఆసక్తి కరం గానే అనిపిస్తున్నాయి కానీ.. ఎంత కాదనుకున్నా నాగ్ అభిమానులకు మాత్రం ఒక డిజాస్టర్ మూవీ తలపుల్లోకి వస్తోంది. అదే.. గత ఏడాది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నాగ్ నటించిన ‘ఆఫీసర్’. నాగ్ అందులోనూ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్ర నే పోషించాడు. ఇప్పుడు కనిపిస్తున్న లుక్కే ఆ చిత్రంలోనూ కనిపించింది. అభిమానులు వద్దు వద్దని మొత్తుకుంటున్నా వినకుండా పూర్ ఫామ్‌ లో ఉన్న వర్మ తో సినిమా చేసి భారీ మూల్యమే చెల్లించుకున్నాడు నాగ్. కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయని ఈ చిత్రం నాగ్ మార్కెట్‌ ను దారుణం గా  దెబ్బ తీసింది. అక్కడి నుంచే నాగ్ బాగా తడబడుతున్నాడు. ఒక రకమైన నెగెటివిటీ చుట్టుకుంది ఆయన చుట్టూ. ఈ దెబ్బ తో ఇప్పుడిప్పుడే నాగ్ మళ్లీ పోలీస్ పాత్ర చేయడని అనుకున్నారంతా. కానీ ఏడాది తిరక్కుండానే ‘ఆఫీసర్’ను పోలిన పాత్ర తో వస్తున్నాడు నాగ్. మరి ‘ఆఫీసర్’ చేదు జ్ఞాపకాల్ని చెరిపేస్తూ ఈ చిత్రం నాగ్‌కు మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.






Tags:    
  • Nagarjuna 
  • Tollywood 
  • Tollywood Latest Updates 
  • Tollywood News 
  • Tollywood Movie News 
  • Telugu Movie News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?

2026-11-20 04:36 GMT

'కింగ్ 100' లో చైత‌న్య అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారా?

2026-11-20 04:36 GMT

2026లోనూ టాయిలెట్..బాత్రూమ్ గురించి మాట్లాడుకునే దుస్తుతి!

2026-11-20 04:36 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

Copyright @2026

Powered by Blink CMS