• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అతనో డాన్.. ఇతనో...

అతనో డాన్.. ఇతనో డాక్టర్..

By - Tupaki Desk
Update: 2018-01-06 13:44 GMT
టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు ఎంత మంది ఉన్నా కూడా ఎవరికీ వారు ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నారు. ముఖ్యంగా నాని లాంటి హీరో ప్రస్తుతం మంచి క్రేజ్ ను అందుకున్నాడు. గత కొంత కాలం నుంచి నాని చేసిన ప్రతి సినిమా మంచి హిట్ అవుతున్నాయి. అంతే కాకుండా మంచి ఓపెనింగ్స్ ని కూడా అందుకుంటున్నాయి. అయితే ఇటీవల వచ్చిన ఎంసీఏ కొంచెం నెగిటివ్ టాక్ అందుకున్నా కూడా హలో సినిమాతో పోటీ పడి దాదాపు రూ.30 కోట్లను దాటింది.

ప్రతి సినిమాకు నాని మార్కెట్ పెరుగుతుండడంతో సినిమాల బడ్జెట్ కూడా పెరుగుతూ వస్తోంది. ఇకపోతే ప్రస్తుతం నాని మరి కొన్ని సినిమాలను కూడా చేయడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే కృష్ణార్జున యుద్ధం సగానికి పూర్తయ్యింది. ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ చెప్పేసింది. ఇక ఆ సినిమాతో పాటు కిషోర్ తిరుమల చెప్పిన కథకు న్యాచురల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ రెండు ప్రాజెక్టులపై అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియదు గాని నాగార్జునతో నాని స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అన్నప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించబోయే ఆ మల్టి స్టారర్ లో నాగ్ క్రైమ్ వరల్డ్ నుంచి రిటైర్ అయిన డాన్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడట. ఇక నాని అతని చేదు జ్ఞాపకాలను మరిచిపోయే విధంగా ప్రయత్నాలు చేస్తుంటాడట. అంటే ఒక డాక్టర్ పాత్రలో నాని కనిపించబోతున్నాడట. ఎమోషనల్ అయినా కామెడీ అయినా ఈ ఇద్దరు నటులు మంచి టైమింగ్ లో నటించగలరు. ఇక ఇద్దరు ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తే ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. మరి ఆ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.
Tags:    
  • Nagarjuna 
  • Nani 
  • Multistarrer Movie 

Similar News

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

Copyright @2026

Powered by Blink CMS