• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇక్కడ నాగార్జున.. అక్కడ...

ఇక్కడ నాగార్జున.. అక్కడ కమల్

By - Tupaki Desk
Update: 2015-11-05 13:30 GMT
సౌత్ ఇండియాలోని ఇద్దరు పెద్ద హీరోలకు సడెన్ గా ఫ్రెంచ్ సినిమాల మీద కన్ను పడింది. ఇక్కడ మన నాగార్జున - అక్కడ కమల్ హాసన్ ఫ్రెంచ్ సినిమాల మీద మనసు పడ్డారు. ఫ్రెంచిలో గత కొన్నేళ్లలో వచ్చిన రెండు బెస్ట్ మూవీస్ ని తెలుగు - తమిళ ప్రేక్షకులకు కానుకగా అందించబోతున్నారు. ముందు తమ సినిమాలు ఫ్రెంచి నుంచి అరువు తెచ్చుకున్నవి అని ఒప్పుకోవడానికి ఇష్టపడని ఈ ఇద్దరు సీనియర్ హీరోలు.. ఇప్పుడు ఆ సంగతి ఒప్పేసుకుంటున్నారు.

ఈ నెల 10న తమిళంలో, 20న తెలుగులో విడుదల కాబోతున్న కమల్ సినిమా ‘చీకటి రాజ్యం’కు ‘స్లీప్ లెస్ నైట్స్’ అనే ఫ్రెంచి సినిమా స్ఫూర్తి అని సినిమా మొదలైనపుడే వార్తలొచ్చాయి. కానీ కమల్ అప్పట్లో సైలెంటుగా ఉన్నాడు. కానీ విడుదల దగ్గరపడ్డపుడు ఆ సంగతి ఒప్పేసుకున్నాడు. ఐతే తాము తీసింది ఫ్రీమేక్ కాదని.. హక్కులు కొన్నామని ఆయనంటున్నారు. ఆయన స్లీప్ లెస్ నైట్స్ సినిమా తీసిన వాళ్ల దగ్గర హక్కులు తీసుకోలేదు. ఆ సినిమాకు ఆధారమైన నవలకు సంబంధించి రైట్స్ కొనుక్కున్నారు.

ఇక నాగ్ సినిమా ‘ఊపిరి’ విషయానికి వస్తే.. అది ‘ఇన్ టచబుల్స్’ అనే సినిమా ఆధారంగా రూపొందింది. ఈ సంగతి నాగ్ కూడా ఒప్పేసుకున్నాడు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాగానే గుర్తింపు సంపాదించింది. మరి హక్కులు కొన్నారో లేదో కానీ.. ఆ సినిమా ఆధారంగా తీస్తున్నట్లయితే ఒప్పుకున్నారు సంతోషం. మరి ఈ ఫ్రెంచ్ స్ఫూర్తి మన సీనియర్ హీరోలకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Tags:    
  • Nagarjuna 
  • Kamal Haasan 
  • French movie COncepts 
  • Telugu NEWs 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS