మా ఇద్దరికీ దెయ్యాలంటే చచ్చే భయం

Update: 2017-04-20 08:06 GMT
నాగ చైతన్య నంటించిన 'రా రండోయ్ వేడుక చూద్దాం' మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా.. ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు నాగార్జున. సినిమా సంగతులతో పాటు పలు ఆసక్తికరమైన విషయాలను కూడా చెప్పుకొచ్చారు. తనకు నచ్చకపోతే అసలు మూవీ రిలీజ్ చేయనన్న ఆయన.. ఈ మూవీలో జగపతి బాబు పాత్ర చాలా బాగుంటుందని అన్నారు.

'లెజెండ్ లో జగపతి బాబు యాంగ్రీ సాల్ట్ అండ్ పెప్పర్ విలన్ గా కనిపించాడు. ఇందులో చక్కని తండ్రి కనిపిస్తాడు. ఈ సినిమా నుంచే కాదు.. మా ఇద్దరికి రిలేషన్ ఎప్పటి నుంచో ఉంది. తనకి.. నాకు ఇద్దరికీ దెయ్యాలంటే చచ్చేంత భయం. రాజుగారి గది2 సెట్స్ పై కూడా ఇదే విషయం మాట్లాడుకున్నాం. ఏంటీ దెయ్యాల సినిమా చేస్తున్నావ్ అని అడిగాడు' అంటూ తమ చిన్ననాటి గురించి.. దెయ్యాలంటే ఉన్న భయ్యం గురించి చెప్పారు నాగార్జున.

'ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర పేరు భ్రమరాంబ. జగపతి బాబు కూతురిగా నటిస్తోంది. వారిద్దరి కేరక్టర్ మధ్య కనెక్టివిటీ.. రిలేషన్ చాలా బాగుంటుంది. పల్లెటూరి నుంచి సిటీ వచ్చి.. ఇంకా లంగా ఓణీలు కట్టే అమ్మాయిగా కనిపిస్తుంది. పరీక్ష పాసవాలంటే.. దేశంలోని గుళ్లన్నీ మొక్కితే చాలు అనుకుంటుంది. చాలా బాగా చేసింది.. తెలుగు యాస మాట్లాడ్డం కూడా బాగుంది. ఈ మూవీలో కొత్త రకుల్ ప్రీత్ కనిపిస్తుంది.. తప్పకుండా మంచి పేరు వస్తుంది' అని చెప్పారు నాగ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News