విజిల్ వేసి రెచ్చ‌గొడుతున్న‌ గోపీచంద్.. గన్ తీసి చూపిస్తున్న నాగార్జున!

Update: 2021-02-14 23:30 GMT
లాక్ డౌన్ త‌ర్వాత థియేట‌ర్లు తెరుచుకోవ‌డంతో సినిమాల‌న్నీ ఒక్క‌సారిగా రేసులోకి దూసుకొస్తున్నాయి. నేనంటే నేను ముందుగా వ‌స్తాన‌ని పోటీ ప‌డుతున్నాయి. దీంతో.. రిలీజ్ డేట్లు క్లాష్ అవుతున్నాయి. ముఖ్య‌మైన సీజ‌న్స్ లో స్లాట్లు ఖాళీగా లేక‌పోవడంతో క్లాష్ అయినా ప‌ర్వాలేద‌ని సేమ్ డేట్స్ లో రిలీజ్ చేసేస్తున్నారు ప‌లువురు మేక‌ర్స్‌.

అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్-ప్రొడక్షన్ ద‌శ‌లో ఉంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ ‘రా’ ఏజెంట్ గా కీలక పాత్ర పోషిస్తోంది. మరో అందాల భామ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే.. ఓటీటీలో ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. మేక‌ర్స్ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ల కార‌ణంగా ఇంత‌కాలం వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను థియేట‌ర్ లోనే రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు నిర్మాత‌లు. కానీ.. అప్ప‌టికే సినిమాల‌న్నీ స‌మ్మ‌ర్ బెర్త్ ను క‌న్ఫాం చేసుకున్నాయి. దీంతో.. ఏప్రిల్ 2న సినిమాను రిలీజ్ చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

అయితే.. ఇదే రోజున హీరో గోపిచంద్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. గోపీచంద్‌, త‌మ‌న్నా కాంబినేష‌న్లో తెర‌కెక్కుతున్న మూవీ ‘సీటీ మార్’‌. లాక్ డౌన్ అవాంత‌రం త‌ర్వాత శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ‘గౌతమ్ నంద’ సినిమా తరువాత చాలా కాలం గ్యాప్‌ తీసుకున్న దర్శకుడు సంపత్‌ నంది.. ఈ‌ సినిమాను తెరకెక్కస్తున్నాడు.

ఈ సినిమాలో దిగంగన తోపాటు భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్‌, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా క‌నిపించ‌నున్నారు. అయితే.. చాలా కాలంగా వాయిదా ప‌డ‌డంతో ఈ సినిమాను కూడా స‌మ్మ‌ర్ బ‌రిలో నిల‌పాల‌ని డిసైడ్ అయ్యారు మేక‌ర్స్‌. దీంతో అన్ని స్లాట్ల‌నూ ప‌రిశీలిస్తే.. ఏప్రిల్ 2 మాత్ర‌మే బెట‌ర్ గా క‌నిపించింది. దీంతో.. అదే రోజు రిలీజ్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

ఈ విధంగా అటు నాగార్జున‌.. ఇటు గోపీచంద్ సినిమాలు ఒకే రోజున థియేట‌ర్ల‌ను తాక‌బోతున్నాయి. మ‌రి, ఎవ‌రి సినిమా హిట్ కొడుతుంది? ఎవ‌రు పై చేయి సాధిస్తారు? అన్న‌ది చూడాలి.




Tags:    

Similar News