మెగా ప్రిన్సెస్ నిహారిక.. ఐజీ కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన చైతన్యను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లి వేడుకలు మెగా సెలబ్రేషన్స్ కి సంబంధించిన విజువల్స్ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తన కుమార్తె మెచ్చిన వరుడిని వెతికినందుకు నాగబాబు ఎంతో సంతోషంగా ఉన్నారు. నిహారిక-చైతన్య దంపతుల రొమాంటిక్ లవ్ లైఫ్ కి సంబంధించిన ఫోటోలు ఇన్ స్టా వేదికగా వైరల్ అవుతున్న సంగతి తెలిసినదే.
ఇక అల్లుడికి ఉగాది కానుక అందింది. అయితే కానుక కాస్త ఆలస్యంగా అందింది. అల్లుడికి ప్రేమపూర్వకంగా నాగబాబు అదిరిపోయే రేంజ్ రోవర్ కార్ ని కానుకగా ఇచ్చారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో నాగబాబు స్వయంగా కారును చైతన్య- నిహారికా జంటకు డెలివరీ చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఉగాదికి కానుకివ్వాలనుకున్నాను కానీ ఆలస్యమైంది అని నాగబాబు తెలిపారు. హైదరాబాద్ షేక్ పేటలోని ల్యాండ్ రోవర్ షోరూమ్ కి నాగ బాబు చేరుకున్నట్లు విజువల్స్ చెబుతున్నాయి. కారును తనిఖీ చేసిన తరువాత నాగబాబు అవసరమైన పత్రాలపై సంతకం చేసి కారు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న చైతన్య నివాసానికి పంపించారు. నాగ బాబు అతని భార్య ఇచ్చిన బహుమతిని అందుకుని ఆ కొత్త జంట కొత్త కారులో చిల్ చేస్తారు.
తెలుపు రంగు రేంజు రోవర్ ఖరీదు కూడా ఆ రేంజులోనే ఉంది. ఐదు సీట్ల ఎస్.యూ.వీ ఎక్స్‌షోరూమ్ ధర 64.44 లక్షలు. ఇకపై మెగా ప్రిన్సెస్ ని అల్లుడు ఇదే కార్ లో షికార్ తిప్పుతారన్నమాట.